Supreme Court: “మహిళా వైద్యుల భద్రత మీ బాధ్యత”.. బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- కోల్‌కతా వైద్యురాలి ఘటనపై విచారణ..
- మహిళా వైద్యులకు నైట్ డ్యూటీ మినహాయిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్..
- మహిళలు రాత్రి పూట పనిచేయలేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు..? వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత..
- సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ‘‘మహిళలు పనిచేయని మీరు ఎలా చెప్పగలరు..రాత్రి వేళ్లలో మహిళా వైద్యులకు రాయితీ అక్కర్లేదు..అదే షిఫ్టులో పనిచేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు’’ అని బెంగాల్ ప్రభుత్వం తరుపున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్‌ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
‘‘మిస్టర్ సిబల్ మీరు దీన్ని చూడాలి. దానికి సమాధానం మీరు తప్పనిసరిగా భద్రత ఇవ్వాలి. పశ్చిమ బెంగాల్ నోటిఫికేషన్ సరిచేయాలి. భద్రత కల్పించడం మీ డ్యూటీ. మహిళలు రాత్రి పూట పనిచేయలేరు అని మీరు చెప్పలేరు. పైలట్లు, ఆర్మీ మొదలైనవి రాత్రి కూడా పనిచేస్తున్నాయి. ’’ అని సీజేఐ అన్నారు. మహిళా వైద్యులు పరిస్థితి రాత్రిపూట పని చేయకపోవడం వారి కెరీర్‌కి విఘాతం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ మహిళా వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వడానికి కొత్త చొరవను ప్రకటించారు. అన్ని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల వద్ద ఉమెన్-ఫ్రెండ్లీ భద్రతా సిబ్బందిని మోహరిస్తామని చెప్పారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వద్ద స్థానిక పోలీసులతో నిత్యం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.రాత్రి విధుల విషయంలో మహిళా వైద్యులు జంటగా పనిచేసే విధంగా షిఫ్ట్‌లు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!