PM Modi: విదేశాల్లో భారత పరువు తీస్తున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పీఎం మోడీ..
- అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఫైర్..
- విదేశాల్లో కాంగ్రెస్ దేశ పరువుని తీస్తోంది..
- దేశంలో అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు. ‘‘నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్పూర్తి చచ్చిపోయింది. నేటి కాంగ్రెస్‌లో ద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ళ భాష, వారి దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానించడం గురించి మాట్లాడటం చూడండి – ఇది ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’, ‘‘అర్బన్ నక్సల్స్’’ కి చెందినవారు నడుపుతున్న కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణేషుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్‌లో ఎలా ఉంచిందో చూశాం.’’ అని మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
Read Also: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
కాంగ్రెస్ అంటే అబద్ధాలు, మోసం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అక్కడ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నారని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి, అవినీతి పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమేనని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బలహీన వర్గాలను ఎదగనీయడం లేదని, కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ ఆలోచనని తొలగించిందని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు విశ్వకర్మ సోదరులను ఆదుకుని ఉంటే ఈ సమాజానికి ఎంతో సేవ చేసి ఉండేవారని అన్నారు.
మహారాష్ట్రలో గత ‘‘ మహావికాస్ అఘాడీ’’ పాలనని విమర్శించారు. పత్తి రైతుల్ని ఠాక్రే ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. మహారాష్ట్ర రైతులకు పత్తి పంటను బలంగా మార్చకుండా అప్పటి ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టి, రైతుల పేరుతో రాజకీయాలు చేసి, అవినీతికి పాల్పడిందని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ 2014లో ఏర్పడిందని, ఆ సమయంలో అమరావతిలో టెక్స్‌టైల్స్ పార్కు పనులు ప్రారంభమైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?