Yahya Ayyash: యాహ్య అయ్యాష్, హమాస్ ఉగ్రసంస్థలో బాంబు తయారీలో నేర్పరి. అందుకే ఇతడిని అందరూ ముద్దుగా ‘‘ది ఇంజనీర్’’గా పిలుచుకునే వారు. ఇతడికి ప్రత్యేకం పెద్ద అభిమాన వర్గమే ఉండేది. ఇతడు తయారు చేసిన బాంబుల్ని చుట్టుకుని ఆత్మాహుతి దాడుల్లో మరణించడం గౌరవంగా భావించేవారంటే అతిశయోక్తి కాదు. ఇజ్రాయిల్‌ని ముప్పుతిప్పలు పెట్టిన ఇతడిని హతం చేయడానికి ఆ దేశ స్పై ఏజెన్సీలు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాయి. తరుచూగా వేషాలు, ప్రాంతాలు మార్చే అయ్యాష్‌ని ఇజ్రాయిల్ నిఘా విభాగాలు కనుగొనడం కష్టంగా మారింది. అయినా కూడా పట్టు వదలకుండా, అయ్యాష్‌ని కనుగొని అతడు వాడే మొబైల్ ఫోన్‌లో ఆర్డీఎక్స్ అమర్చిన ఇజ్రాయిల్, అతడిని అంతమొందించింది.
తల్లిదండ్రులపై అయ్యాష్‌కి ఉన్న ప్రేమే అతడి ప్రాణాలను తీసింది. ‘‘ఎలా ఉన్నారు నాన్నా..?’’ అని అయ్యాష్ అడిచిన చివరి పలుకులను అబ్దుల్ లతీఫ్ విన్నాడు. ఆ తర్వాత ఎంతగా డయల్ చేసిన అయ్యాష్‌కి ఫోన్ కలవలేదు. మొబైల్ ఫోన్ పేలిపోవడంతో ‘‘ఇజ్రాయిల్ ఒసామా బిన్ లాడెన్’’ పిలిచే అయ్యాష్ హతమయ్యాడు. 29 ఏళ్ల హమాస్ లీడర్ తన బాంబుల ద్వారా 150 కన్నా ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యాడు. ఇజ్రాయిల్ సెల్ ఫోన్ దాడిలో మరణించిన మొదటి వ్యక్తిగా మారాడు. అతడి పక్కన ఉన్న వ్యక్తికి ఒక్క గీత కూడా కాకుండా అత్యంత పకడ్భందీగా ఇజ్రాయిల్ ఆపరేషన్‌ని అమలు చేసింది. మొబైల్ ఫోన్ పేలుడు ధాటికి అయ్యాష్ మెదడు బయటకు వచ్చింది. ఈ ఘటన 1996లో జరిగింది. నవంబర్ 1995లో ఇజ్రాయిల్ ప్రధాని యిట్జాక్ రాబిన్ హత్య తర్వాత అయ్యాష్‌ని ఇజ్రాయిల్ హతం చేసింది.
ఇజ్రాయిల్‌ని కలవరపెట్టిన అయ్యాష్:
ది ఇంజనీర్‌గా పిలిచే అయ్యాష్ ఉనికి చాలా కాలం పాటు ఇజ్రాయిల్‌కి తెలియదు. వెస్ట్ బ్యాంక్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన అయ్యాష్ బాంబుల తయారీలో నేర్పరి. ఇతను చేసిన బీట్ లిడ్ మారణహోమంతో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగింది. పాలస్తీనా జిహాద్ చేసిన మొదటి ఆత్మాహుతి దాడి ఇదే. ఇందుల్లో 21 మంది ఇజ్రాయిల్ సైనికులతో సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. టీఎన్‌టీ వంటి పేలుడు పదార్థాలు అందుబాటు లేని సమయంలోనే అయ్యాష్, ఇంట్లో వాడే అసిటోన్, డిటర్జెంట్ సాయంతో అత్యంత పేలుడు సామర్థ్యం ఉన్న ‘‘ మదర్ ఆఫ్ సైతాన్’’ని తయారు చేశాడు.
అయితే, ఇలా ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ముగ్గురు వ్యక్తులు సిద్ధమవుతున్న సందర్భంలో వారి పథకం విఫలమైంది. వీరు ఇజ్రాయిల్ పోలీసులకు పట్టుబడటంతో అయ్యాష్ గుర్తింపు గురించి వారికి సమాచారం తెలిసింది. దీంతో వెస్ట్ బ్యాంక్‌లో ఇతడి కోసం నిఘా ఎక్కువ కావడంతో, నివాసం కోసం గాజాకు వచ్చాడు. దీనికి అతడి స్నేహితుడు ఒసామా హమద్ సాయం చేశాడు. అయ్యాష్ భార్య, కొడుకుని కూడా గాజాలోకి రప్పించుకున్నాడు. అతడి భార్యకి కేవలం కిలోమీటర్ దూరంలో సురక్షిత గృహంలో అయ్యాష్ ఉండేవాడు. భార్యని కలవాలన్నా బుర్ఖా ధరించి వచ్చేవాడు.
తల్లిదండ్రులపై ప్రేమ ప్రాణాంతకంగా మారింది.
అది జనవరి 5, 1996 ఉదయం, యాహ్య అయ్యాష్ తన స్నేహితుడి ఇంటికి 4.30 గంటలకు వచ్చాడు. రాత్రంతా బాంబు తయారు చేసే పనిలో ఉన్నాడు. వెస్ట్ బ్యాంక్‌లోని తన తండ్రిలో మాట్లాడేందుకు తన స్నేహితుడి ఇంట్లోని ల్యాండ్ ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించేవాడు. అయితే, ఇది అంత నమ్మకమైన పని కాకపోవడంతో అతను 050507497 నంబర్‌ను తన తండ్రికి పంపాడు.
మోటరోలా ఫోన్ ఫోన్‌లో కోసం వెతికిన అయ్యాష్, అది కనిపించకపోవడంతో కొంత సేపటికి నిద్రపోయాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే.. అతడు సేద తీరుతున్న ఇంటికి కొద్దిదూరంలోనే ఫీల్డ్ రేడియోలు, సెల్‌ఫోన్లు, బ్లాక్ బాక్స్‌లు, బైనాక్యులర్లతో ఆయుధాలు ధరించిన ఇజ్రాయిలీ సైనికులు వెయిట్ చేస్తున్నారు.
ఫోన్‌లోకి బాంబు ఎలా వచ్చింది..?
మొబైల్ ఫోన్‌లో ఒక రేడియో కంట్రోల్డ్ బాంబుని అమర్చారు. యాభై గ్రాము ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాని ఫోన్‌లో పెట్టారు. అయితే, ఈ ఫోన్ యాహ్యా అయ్యాష్‌కి చేరేలా ఇజ్రాయిలీ ఏజెంట్లతో సంబంధం ఉన్న వ్యక్తి కావాల్సి వచ్చింది. అప్పుడు అయ్యాష్ ఫ్రెండ్ ఒసామా హమద్ మేనమామ, బిల్డింగ్ కాంట్రాక్టర్ అయిన కమల్ హమద్ ఆపరేషన్‌కి సహకరించాడు. కమల్ ఒసామాకి 050-507497 నెంబర్ ఉన్న ఫోన్ ఇచ్చాడు. కమల్ ముందుగా ఒసామా నుంచి కొన్ని రోజులు ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత దీంట్లో పేలుడు పదార్థాన్ని అమర్చేలా ఇజ్రాయిల్‌కి సహకరించి, మళ్లీ ఒసామా హమద్‌కి ఇచ్చాడు.
ఉదయం 8.40 గంటల ప్రాంతంలో అయ్యాష్‌కి తాను వెతుకుతున్న మోటరోలా ఫోన్ రింగ్ అయింది. ఒసామా హమద్ తన ఈ ఫోన్‌ని అయ్యాష్‌కి ఇచ్చాడు. ఉదయం 8 గంటల నుంచి ల్యాండ్‌ఫోన్‌లో తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే కనెక్ట్ కాలేదని అయ్యాష్ తండ్రి చెప్పాడు. అదే సమయంలో అందులో ఉన్న బాంబ్ యాక్టివేట్ అయింది. దీంతో ఒక్కసారిగా బాంబు పేలుడుకు అయ్యాష్ పుర్రె కుడిభాగం దవడ పేలిపోయింది. అయ్యాష్ ఇప్పటికీ పాలస్తీనియన్లలో హీరోగా ఉన్నాడు. అతడి పేరుతో గాజాలో ఓ వీధి కూడా ఉంది.