Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..
- హిజ్బుల్లా టార్గెట్‌గా విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్..
- బీరూట్‌పై వైమానిక దాడులు..
- హిజ్బుల్లా కమాండర్ అకిల్ హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్‌లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.
Read Also: Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై పాము హల్‌చల్.. ప్రయాణికులు పరుగులు
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఇదిలా ఉంటే, ఈ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ మరణించినట్లు సమాచారం. దక్షిణ బీరూట్‌లోని మిలిటెంట్ గ్రూప్ ప్రధాన స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో దాని ఎలైట్ ఫోర్స్ రద్వాన్ యూనిట్ అధిపతి ఇబ్రహీం అకిల్ చనిపోయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తర్వాత ఇరు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి హమాస్‌కి హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది. తరుచుగా ఉత్తర ఇజ్రాయిల్‌పై దాడులకు తెగబడుతోంది. తాజా వైమానిక దాడితో ఏడాదిలో లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇది మూడో దాడి.
ఈ ఏడాది జూలైలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ని ఇలాగే వైమానిక దాడిలో ఇజ్రాయిల్ హతమార్చింది. బీరూట్‌లో అతను నివాసం ఉండే భవనంపై దాడి జరిగింది. అంతకుముందు హమాస్ నాయకుడు సలేహ్ అల్ అరూరి కూడా వైమానిక దాడిలో మరనించాడు. ఫువాద్ షుక్ర్ తర్వాత హిజ్బుల్లా సాయుధ దళానికి సెకండ్ ఇన్ కమాండ్ అయిన రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ మరణించినట్లు ఆ మిలిటెంట్ సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు హిజ్బు్ల్లా ఎలాంటి అధికారిక ప్రకటనని విడుదల చేయలేదు. 1983లో బీరుట్‌లోని యుఎస్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేసి 63 మంది మృతి ఘటనలో అకిల్ ప్రధాన సభ్యుడు. ఇతడి కోసం అమెరికా 7 మిలియన్ల బహుమతి ప్రకటించింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!