India’s wedding industry: నవంబర్, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
- ఈ ఏడాది చివరి రెండు నెలల్లో 35 లక్షల వివాహాలు..
- ఏకంగా 4.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా..
- భారీగా పుంజుకున్న భారత వివాహ పరిశ్రమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s wedding industry: భారతీయ వివాహ పరిశ్రమ పుంజుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏకంగా 35 లక్షల వివాహాలు జరగబోతున్నాయని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, 2023లో ఇదే కాలంలో 3.2 మిలియన్ల జంటలు ఒక్కటయ్యాయి. ఈ ఏడాది 3.5 మిలియన్ల పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనా. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 15-జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాలకు సుమారుగా 5.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ యొక్క నివేదిక,‘‘బ్యాండ్, బాజా, భారత్ అండ్ మార్కెట్స్’’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: Supreme Court: హైకోర్ట్ జడ్జి ‘‘పాకిస్తాన్’’, ‘‘లోదుస్తులు’’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ 2025(FY25)లో 49 మూహూర్త రోజులు, FY24లో 60 రోజులు ఉన్నట్లు తెలిపింది. భారతదేశం సంవత్సరానికి సుమారు 10 మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వెడ్డింగ్ మార్కెట్‌గా ఉంది. పెళ్లిళ్లకు తోడుగా ఇంటారాక్టివ్ కార్యక్రమాలు, మల్టీసెన్సరీ ఫుడ్ కౌంటర్లు, డ్రోన్ షోలు, ఆడియో ఇన్విటేషన్ ఇలాంటివి పెళ్లిళ్ల ఖర్చుల్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. గిఫ్ట్ పోర్టల్ FNP ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 30-40 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. దీనికి తోడు ఈ ఏడాది వివాహాలు నిర్వహించడానికి చాలా మంది ఎన్నారై జంటలు భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ఫెర్న్స్ ఎన్ పెటల్స్ వ్యవస్థాపకుడు మరియు ఎండి వికాస్ గుట్గుటియా తెలిపారు. ప్రభుదాస్ లిల్లాధర్ నివేదిక ప్రకారం.. బంగారంపై దిగుమతి సుంకాలు 15 శాతం నుంచి 6 శాతం తగ్గడంతో దేశవ్యాప్తంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లలో గణనీయమైన పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!