Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
- కర్ణాటక రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి..
- ముస్లింలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయమని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
ముస్లింను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ప్రభుత్వ చర్యని ఖండించారు. ‘‘అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం పొందడానికి ఉర్దూ తప్పనిసరిగా తెలుసుకోవాలనే ప్రకటన ఆమోదయోగ్యం కాదు. ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడానికి కాంగ్రెస్ చేసిన మరో ప్రయత్నం ఇది. ఇది ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం.’’ అని అన్నారు.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
Read Also: Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉర్దూలో ప్రావీణ్యం కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొంది. ‘‘కర్ణాటక ప్రభుత్వం కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూని విధిస్తోంది. రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ కంటే ఉర్దూకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వివరించాలి’’ అని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
అయితే, దీనిపై ముదిగెరె విద్యాశాఖ ప్రభుత్వ నోటిఫికేషన్‌పై ఆందోళనకు దిగింది. డిప్యూటీ డైరెక్టర్ రాసిన లేఖలో, స్థానిక జనాభాలో వివిధ సంఘాలు ఉన్నాయని, ముస్లింలు 31.94% మంది ఉన్నారని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జనాభాలో 25 శాతానికి పైగా మైనారిటీ వర్గాలు ఉన్న ప్రాంతాల్లో, కన్నడతో పాటు మైనారిటీ భాషలో ప్రావీణ్యం ఉన్న వర్కర్లను నియమించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!