Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మద్యం తాగుతున్న కొడుకుని అడ్డుకున్నందకు తండ్రి హత్యకు గురయ్యాడు. తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను మరనించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. యువకుడు తండ్రి తలపై ఇటుకతో బలంగా కొట్టాడు. దీంతో అతను మరణించాడు. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడైన కుమారుడు ప్రయత్నించాడు.
MUDA land Scam: ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను రాజీనామా చేసే…
Pakistan-Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగ చర్చలు జరుపుతోంది.
Israel-Lebanon Tension:ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది.
Iraqi Airways: ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్వేస్ విమానం కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బుధవారం కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాన్ని దారి మళ్లించారు.
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాలక్ష్మీని చంపేసి 59 ముక్కలుగా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మి(29) హత్య కేసులో సంచలనం నెలకొంది. ఈ హత్యలో కీలక నిందితుడిగా భావిస్తున్న సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ బుధవారం ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం బెంగళూర్ నుంచి ఒడిశాకు పారిపోయాడు. విచారణలో భాగంగా రాయ్‌ని పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు. అయితే, వారు అతడిని అదుపులోకి తీసుకునే ముందే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mahindra Thar Roxx 4x4 Price: మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని రోడ్ అప్పియరెన్స్‌తో ఎంతో మందికి ఇది డ్రీమ్ ఆఫ్‌రోడర్‌గా మారింది. ఇటీవల థార్ రాక్స్ పేరుతో మహీంద్రా 5-డోర్ వెర్షన్‌ని తీసుకువచ్చింది. అయితే, ఇటీవల థార్ రాక్స్ ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఆ సమయంలో కేవలం రేర్ వీల్ డ్రైవ్(RWD) ధరలు మాత్రమే వెల్లడించారు.
Iran: ఇజ్రాయిల్, లెబనాన్‌లో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. వరసగా దాడులు నిర్వహిస్తోంది. గత వారం పేజర్ల దాడి జరిగిన తర్వాత లెబనాన్‌పై దాడుల్ని విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కమాండర్లను హతమార్చడం హిజ్బుల్లాని మోకాళ్లపైకి తీసుకురాదని అన్నారు. హిజ్బుల్లా సంస్థాగత బలం, మానవ వనరులు చాలా బలంగా ఉన్నాయని, ఒక సీనియర్ కమాండర్‌ని చంపడం వల్ల అది నష్టపోదని ఖమేనీ చెప్పారు.
Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుచ్చి-చెన్నై హైవేపై వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.