MUDA land scam: ‘‘తెరవెనక సిద్ధరామయ్య లేడని అంగీకరించడం కష్టం’’.. ముడా కుంభకోణంలో హైకోర్టు కామెంట్స్..
- ముడా భూ కుంభకోణంపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- తెరవెనక సిద్ధరామయ్య లేరంటే నమ్మలేం..
- లక్షల పరిహారం కోట్లుగా ఎలా మారింది..?
- సిద్ధరామయ్యపై హైకోర్టు ప్రశ్నల వర్షం..
- ఈ కేసుని విచారించాల్సిందే అని ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది. ముడా ల్యాండ్ స్కాంలో సీఎంపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు ఆదేశించారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ రోజు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి రావాలి’’ అని, సిద్ధరామయ్య పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లుగా తీర్పు చెప్పారు.
Read Also: GANJA: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్
Also Read
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
దీంతో సీఎంపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ మరియు భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 218 కింద తనపై దర్యాప్తునకు మార్గం సుగమమైంది. మూడా భూముల లావాదేవీల్లో సిద్ధరామయ్య ‘‘తెర వెనక’’లేదని, అతడి కుటుంబానికి సుమారుగా రూ. 56 కోట్ల మేర లబ్ధి చేకూరిందనే విషయాన్ని అంగీకరించడం కష్టమని జస్టిస్ నాగ ప్రసన్న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘రూ. 3.56 లక్షలగా నిర్ణయించిన పరిహారం, లబ్ధిదారుడికి రూ.56 కోట్లుగా మారడం అంగీకరించలేమని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఎందుకు, ఎలా నిబంధన మారింది. దీనిని దర్యాప్తు చేయాలి’’ అని న్యాయమూర్తి అన్నారు.
మైసూర్ నగరాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి భార్య పార్వతి నుంచి భూమి సేకరించిన ప్రభుత్వం, ఆమె భూమి కోల్పోయిన ప్రాంతంలో కాకుండా మైసూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను కేటాయించం వివాదాస్పదమైంది. దీనిపై ముగ్గురు ఆర్టీఐ యాక్టవిస్ట్‌లు గవర్నర్‌కి పిటిషన్ సమర్పించారు. దీని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఉత్తర్వులు చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహాతో సహా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని సిద్ధరామయ్య కోర్టు ముందు వాదించారు.
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!