Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల హింస చెలరేగిన సంభాల్‌కి రేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ బృందంతో రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 24న యూపీలోని సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో వేల సంఖ్యలో గుంపు అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేసింది. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. […]
Cement Prices: సిమెంట్ ధరలు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు యెస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. ఈ సెక్టార్లో తీవ్రమైన పోటీ కారణంగా సిమెంట్ ధరలు కనిష్టానికి పడిపోయినట్లుగా చెప్పాయి. ఇటీవల త్రైమాసికాల్లో ధరలు పెంచడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ పెరుగుదలపై వెనక్కి తగ్గాయని నివేదిక పేర్కొంది. బలహీనమైన మార్కెట్ పరిణామాలు, డిమాండ్‌ని తగ్గించాయని వెల్లడించింది.
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ఇటీవల తీవ్ర హింస చెలరేగింది. నగరంలోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై అక్కడి గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. వేల మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.
S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్లో మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 2020 నుంచి అసాధారణంగా ఉన్న సంబంధాలు నెమ్మదిగా మెరుగవుతున్నాయని ఆయన చెప్పారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో రెండు మిలిటరీలు ఘర్షణ పడ్డాయి, 45 ఏళ్లలో మొదటిసారి ఇరువైపుల మరణాలకు దారి తీసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరగయ్యాయని జైశంకర్ అన్నారు. నితంతర దౌత్య చర్చలు రెండు దేశాల సంబంధాలను కొంత మెరుగుపరిచే దిశలో ఉంచాయని వివరించారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడి మైనారిటీలకు న్యాయం కూడా దొరకడం లేదు. బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ సన్యాసి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి అధికారులు దేశద్రోహం కేసుపై అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, అతడి తరుపున వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రావడం లేదు.
Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు.
Sukhbir Badal: సిక్కుల అత్యున్నత సంస్థ ‘‘అకల్ తఖ్త్’’ పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌కి శిక్ష విధించింది. మతపరమైన తప్పులు, రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం టాయ్‌లెట్స్, వంటగదిని శుభ్రం చేయాలని ఆదేశించింది.
Packaged drinking water: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘‘హై రిస్క్ ఫుడ్ కేటగిరీ’’లో చేర్చింది. ఇలా వర్గీకరించడం వల్ల ఈ ఉత్పత్తులను తప్పని సరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించింది.
BJP Leader Suicide: గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ మెంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకులురా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త రైతు, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.