S Jaishankar: భారత చరిత్రకారుడు విక్రమ్ సంపత్ రచించిన 'టిప్పు సుల్తాన్: ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్రెగ్నమ్' పుస్తకావిష్కరణకు విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఇడియన్ హాబిటాట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు నడుస్తున్న సమయంలో గుండె పోటుతో మణించాడు. మోహిత్ చౌదరి అనే బాలుడు తన పాఠశాలలో క్రీడా పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిరౌలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు. 21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి […]
Syria Crisis: మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్-హమాస్-హిజ్బుల్లా-ఇరాన్ వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉంటే, తాజాగా సిరియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై తిరుగుబాటుదారులు పైచేయి సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధాని డమాస్కస్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న అలెప్పోపై రెబల్స్ పట్టుసాధించారు. ఇప్పుడు రాజధాని డమాస్కస్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అలెప్పోకి దారి తీసే అన్ని రహదారుల్ని, సమీప ప్రాంతాలన్ని రెబల్స్ ఆక్రమించారు. అల్ ఖైదా […]
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం గడిచినా, ఇంకా సీఎం ఎవరనే క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ ‘‘మహాయుతి’’ కూటమి అఖండ విజయాన్ని సాధించింది.
Bihar: బీహార్ ముజఫర్‌పూర్‌లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు.
Kash Patel: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నియామకాన్ని ప్రకటించారు. భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించారు. కాష్ పటేల్ ట్రంప్‌కి సన్నిహిత మిత్రుడు, మాజీ జాతీయ భద్రతా సహాయకుడు. ప్రస్తుతం చీఫ్ క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాష్ పటేల్ ఎఫ్‌బీఐ చీఫ్ కానున్నారు. ‘‘పటేల్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు మరియు 'అమెరికా ఫస్ట్' పోరాట యోధుడు, అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం మరియు అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం తన కెరీర్‌ను…
Arvind Kejriwal: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమవుతోంది. ఇతర మిత్ర పక్షాలు కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పార్లమెంట్లో కాంగ్రెస్ విధానంపై మండిపడుతోంది. సభని సరిగా జరగనివ్వాలని కోరుతోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై అక్కడి మతోన్మాదుల మూక దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెని రక్షించాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. జర్నలిస్ట్ కారును గుంపు అడ్డగించి, ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు.…
Gautam Adani: అదానీ గ్రూప్‌తో పాటు తనపై అమెరికా మోపిన ఆరోపణలపై తొలిసాగారి అదానీ గ్రూప్ చూర్మన్ గౌతమ్ అదానీ ఈ రోజు స్పందించారు. ‘‘ రెండు వారాల క్రితం అదానీ గ్రూప్‌పై అమెరికా ఆరోపణలు ఎదుర్కొన్నాము. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుందని మీకు చెప్పగలను.