S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్‌లో మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 2020 నుంచి అసాధారణంగా ఉన్న సంబంధాలు నెమ్మదిగా మెరుగవుతున్నాయని ఆయన చెప్పారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో రెండు మిలిటరీలు ఘర్షణ పడ్డాయి, 45 ఏళ్లలో మొదటిసారి ఇరువైపుల మరణాలకు దారి తీసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరగయ్యాయని జైశంకర్ అన్నారు. నితంతర దౌత్య చర్చలు రెండు దేశాల సంబంధాలను కొంత మెరుగుపరిచే దిశలో ఉంచాయని వివరించారు.
Read Also: Bangladesh: బంగ్లా హిందూ సన్యాసి తరుపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు..
సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చల ద్వారా చైనాతో సంప్రదింపులు జరపడానికి భారతదేశం కట్టుబడి ఉందని చెప్పారు. ‘‘ఏప్రిల్-మే 2020లో తూర్పు లడఖ్‌లోని LAC (వాస్తవ నియంత్రణ రేఖ) వెంబడి చైనా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించారు. ఫలితంగా అనేక పాయింట్ల వద్ద మన దళాలతో ముఖాముఖి తలపడింది. పెట్రోలింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది’’ అని ఈఏఎం తన ప్రకటనని ప్రారంభించారు. లాజిస్టిక్ సవాళ్లు, కోవిడ్ పరిస్థితి ఉన్నప్పటికీ మన సైన్యం వేగంగా, సమర్థవంతంగా ప్రతిఘటించిందని, ఇది మన సాయుధ దళాల ఘటన అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి, ప్రశాంతత పునరుద్ధరించడానికి దౌత్యపరమైన ప్రయత్నం అత్యవసరమని జైశంకర్ అన్నారు.
సరిహద్దు రక్షణ సహకారంపై అవగాహనకు రావడానికి 1991, 1993, 1996, 2003, 2005, 2012, చివరిగా 2013లో సంతకం చేసిన ఒప్పందాలతో సహా భారతదేశం మరియు చైనాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలను మంత్రి చెప్పారు. తాజాగా ఇటీవల జరిగిన ఒప్పందం డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కి సంబంధించినది. 2020లో ఘల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ తాజాగా పార్లమెంట్లో జైశంకర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.