Sukhbir Badal: “టాయ్‌లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి”.. మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష..
- "టాయ్‌లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి"..
- మాజీ సీఎం సుక్‌బీర్ సింగ్ బాదల్‌కి అకల్ తఖ్త్ ఆదేశం..
- మతపరమైన దుష్ప్రవర్తనకు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhbir Badal: సిక్కుల అత్యున్నత సంస్థ ‘‘అకల్ తఖ్త్’’ పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కి శిక్ష విధించింది. మతపరమైన తప్పులు, రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం టాయ్‌లెట్స్, వంటగదిని శుభ్రం చేయాలని ఆదేశించింది. 2015లో వివాదాస్పద డేరాగా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ సింగ్‌కి క్షమాభిక్ష ప్రకటించడంతో పాటు రాజకీయంగా తప్పుడు నిర్ణయాలకు గానూ మతపరమైన శిక్షను విధించారు.
Read Also: Packaged drinking water: హై-రిస్క్ కేటగిరీలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
అకల్ తఖ్త్ జతేదార్, గియానీ రఘ్‌బీర్ సింగ్ మరో నలుగురు ప్రధాన మతాధికారులు కలిసి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆగస్టు 30న ‘‘తంఖైయా’(మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు) ప్రకటించారు. శిక్షలో భాగంగా అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో నిస్వార్థసేవ చేయాలని సుఖ్‌బీర్ సింగ్‌తో పాటు 2015లో ఆయన కేబినెట్‌లో ఉన్న నాయకులకు సూచించారు. వాష్ రూమ్ శుభ్రం చేయడం, పాత్రలు కడగం, మతపరమైన విధులు చేపట్టడం వంటికి శిక్షలో భాగంగా ఉన్నాయి.
శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఎడి) పార్టీ చీఫ్ పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేసిన రాజీనామాను మూడు రోజుల్లో ఆమోదించాలని అకాల్ తఖ్త్ ఆదేశాలు జారీ చేసింది. SAD వర్కింగ్ కమిటీ ఈ ఉత్తర్వును పాటించాలని, అకాల్ తఖ్త్‌కు తిరిగి నివేదించాలని సూచించబడింది. డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు క్షమాభిక్ష పెట్టడాన్ని అకల్ తఖ్త్ చాలా రోజులుగా విచారించింది. ఈ నిర్ణయం సిక్కు సమాజంలో తీవ్ర విమర్శలకు దారి తీసింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!