Mamata Banerjee: వక్ఫ్ బిల్లు పేరిట ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
- వక్ఫ్ బిల్లులో ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తు్న్నారు..
- హిందువులు, క్రైస్తవుల విషయంలో ఇలా చేసే ధైర్యం ఉందా..
- వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం..
- కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడిన మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో ఈ రోజు తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో మమత మాట్లాడారు. ఈ బిల్లు విషయంలో కేంద్రం రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో కేంద్రం తమని సంప్రదించలేదని చెప్పారు.
Read Also: PM Modi: పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ చూసిన మోడీ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ బిల్లు విషయమై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చల్లో బీజేపీ ప్రతిపక్ష సభ్యుల నోరు మూయించిందని టీఎంసీ చీఫ్ ఆరోపించారు. జేపీసీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వారు అందకే బహిష్కరించాలని మమతా బెనర్జీ అన్నారు. ముస్లింలను ఒంటరిగా చేయడం ద్వారా కేంద్రం విభజన ఎజెండాను ముందుకు తెస్తోందని ఆమె ఆరోపించారు.
‘‘”ఈ వక్ఫ్ (సవరణ) బిల్లు పేరుతో ఒకే మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వివిధ హిందూ దేవాలయాల ట్రస్ట్‌లు లేదా చర్చిల ఆస్తులతో మీరు అదే పని చేయడానికి ధైర్యం చేస్తారా? సమాధానం లేదు. కానీ, నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం మీ విభజన ఎజెండాకు నిదర్శనం’’ అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ లేనందున ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించగలరా..? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై, పొరుగు దేశంలోని హిందువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!