ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) స్పందించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని కేటీఆర్‌కు చెప్పామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పామని సిట్ అధికారి అధికారులు చెప్పారు. కేటీఆర్‌ను ఒంటరిగానే ప్రశ్నించాం అని.. ఆధారాలు, రికార్డులు ముందుంచి ప్రశ్నలు అడిగామన్నారు. నేటి విచారణ కేవలం క్రైమ్ నం.243/2024కే పరిమితం అని.. ఇది వేలాది మందిపై జరిగినట్టు ఆరోపణలున్న అక్రమ ఫోన్ నిఘా కేసు అని సిట్ అధికారులు తెలిపారు.
Also Read: Jogi Ramesh: మీ రాక్షస ఆనందం తీరిందా?.. దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయండి!
భద్రతా కారణాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ప్రచారాన్ని సిట్ ఖండించింది. కొన్ని మీడియా కథనాలు తప్పుడు, ఆధారరహితమని స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతోందని తెలిపింది. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారికంగా వెలువడే సమాచారాన్నే నమ్మాలని సూచించింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ప్రశ్నలు అడిగారు. రికార్డులో ఉన్న ఆధారాలతో కేటీఆర్‌ను సిట్ విచారించింది. విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.