Pappu Yadav: బీహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరాడు.
Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సేవ చేస్తున్న బాదల్‌పై అగంతకుడు దాడికి యత్నించాడు. తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశాడు.
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే వివాదం తీవ్ర హింసకు కారణమైంది. రాళ్లదాడి, గృహాల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించిన గుంపు హింసాత్మకంగా ప్రవర్తించింది. ఈ హింసాత్మక దాడుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఇదిలా ఉంటే,
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 05న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండేని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత తొలిసారి ఫడ్నవీస్, షిండే సమావేశమయ్యారు.
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం ఆ దేశంలో ‘‘ ఎమర్జెన్సీ మార్షల్ లా’’ ప్రకటించారు. బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్లో వాగ్వాదం మధ్య దేశాన్ని ‘‘కమ్యూనిస్ట్ శక్తుల’’ నుంచి రక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. విపక్ష పార్టీలు ఉత్తర కొరియా వైపు సానుభూతి చూపిస్తున్నాయని, ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Donald trump: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్లో "51వ రాష్ట్రం"గా చేయడంపై జోక్ చేశారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు ఘన విజయం లభించింది. గందర్బాల్లో ఓ ప్రైవేట్ కంపెనీ హౌసింగ్ క్యాంపులో ఆరుగురు కార్మికులను, వైద్యుడిని చంపేసిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదిని పాకిస్తాన్‌కి చెందిన లష్కరేతోయిబాకి చెందిన జునైద్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. ఈ ఉగ్రవాది గగాంగీర్, ఇతర ప్రదేశాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా పాల్గొన్నాడు.
INDIA bloc: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత, ఇండియా కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంపై ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీని ఇండియా కూటమి చీఫ్‌గా నియమించాలని తృణమూల్ ఎంపీ కీర్తి ఆజాద్ కొత్త చర్చని లేవదీశారు. ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు మమతా బెనర్జీ సరైన వ్యక్తి అని, ఆమెకు ఆ రికార్డు ఉందని అన్నారు.
Mahindra BE 6E: స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E కార్లను రిలీజ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టన్నింగ్స్ లుక్స్‌తో వినియోగదారులను వెంటనే ఆకర్షించేలా మహీంద్రా ఈ కార్లను డిజైన్ చేసింది. ఇదంతా బాగానే ఉన్నా, ప్రస్తుతం మహీంద్రా BE 6Eపై భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. BE 6E కారులో ‘‘6E’’ని ఉపయోగించడంపై ఇండిగో ఈ కేసు […]