Supreme Court: డ్రగ్స్ కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిందితుడి తరుఫున వాదించిన న్యాయవాది.. సదరు వ్యక్తి సమాజానికి గణనీయమైన ప్రమాదం కలిగించలేదని, అతడి అరెస్ట్ అనవసరమని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి.
CAPF: ఎక్కువ గంటలు డ్యూటీ చేయడం, నిద్రలేమి కారణంగా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, సర్వీస్ పూర్తి కాకముందే స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేస్తున్నారు. 730 మంది జవాన్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, 55,000 మందికి పైగా రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో చెప్పింది.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. రేపు సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఎన్డీయే నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ రాధాకృష్ణన్‌కి కలిసిన మహాయుతి నేతలు, ప్రభుత్వ ఏర్పాటును కోరారు.
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. రేపు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
EV adoption: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) స్వీకరణ పెరుగుతోంది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని FICCI-యెస్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈవీ స్వీకరణలో ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. ఢిల్లీలో ఈవీ పెనట్రేషన్ రేటు 11.5 శాతంగా ఉందని, వివిధ విభాగాల్లో ఈవీలను అడాప్ట్ చేసుకుంటున్నట్లు నివేదిక హైలెట్ చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
Saudi Arabia: సౌదీ అరేబియా ఈ ఏడాదిలో 300 మందికి పైగా ఖైదీలకు మరణశిక్ష విధించింది. మంగళవారం మరో నలుగురికి ఉరిశిక్ష విధించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురికి, హత్య నేరంలో ఒకరికి శిక్షని అమలు చేసింది. ఆ దేశ స్టేట్ మీడియా లెక్కల ఆధారంగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 303 మందికి మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది.