Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో సీనియర్ సిటిజన్లకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వీరికి ఉపయోగపడేలా కీలకమైన పన్ను సంస్కరణల్ని ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1,00,000 కు పెంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనను సీనియర్ సిటిజన్లు స్వాగతిస్తున్నారు. దీని వల్ల మెరుగైన ఆర్థిక ఉపశమనం ఉండటంతో పాటు, వారిపై పన్ను భారం తగ్గబోతోంది, వారి పొదుపును పెంచే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉండబోతోంది.
Nirmala Sitharaman: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బడ్జెట్‌ని ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్’’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ‘‘దివాళా ఆలోచన’’తో బాధపడుతోందని అన్నారు.
Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) విదేశీ దేశాలకు సహాయం కోసం రూ. 5,483 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది రూ. 5806 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువ. విదేశాంగ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ. 20,516 కోట్లుగా ఉంది. దీని నుంచే మన పొరుగు, మిత్ర దేశాలకు భారత్ సాయాన్ని అందిస్తోంది.
PM Modi: కేంద్ర బడ్జెట్ 2025 ‘‘ప్రజల బడ్జెట్’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని బడ్జెట్ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ పెట్టుబడుల్ని పెంచుతుందని, ఇది ‘‘వికసిత భారత్’’ లక్ష్యానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
MU: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ‘‘అసభ్యకరమై వ్యాఖ్యలు’’ చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU) గెస్ట్ లెక్చరర్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జనవరి 11 రాత్రి అతడికి, ఏఎంయూ భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొనబడింది. ఈ సంఘటనపై ఏఎంయూ అధికారులు సంస్కృత విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అరిమందన్ సింగ్ పాల్కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. మహిళ గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి మహిళ గొంతు కోసం గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్‌కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
KumbhMela Special Trains: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా కోసం 06 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్లు బీదర్-దానాపూర్, చర్లపల్లి-దానాపూర్, దానాపూర్-చర్లపల్లి మధ్య నడవనున్నాయి. బీదర్-దానాపూర్-చర్లపల్లి మధ్య 02 రైళ్లు, చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మధ్య 04 సర్వీసులను ఏర్పాటు చేశారు.
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయని ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇరువురు నేతల భేటీపై రెండు దేశాలు కృషి చేస్తున్నట్లు తెలిపింది
Working hours: ఇటీవల పలు సంస్థల సీఈఓలు, కీలక అధికారులు ఉద్యోగులు పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఉద్యోగి వారానికి 70-90 గంటలు పనిచేయలనే వాదన నేపథ్యంలో బడ్జెట్ ముందు కేంద్రం తీసుకువచ్చిన ‘‘ఆర్థిక సర్వే’’ కీలక విషయాలను చెప్పింది.