Kerala: కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది. భర్త, అత్తింటి వారి అవమానాలు, హింసను ఎదుర్కొన్న మహిళ మరణించింది. గత వారం కేరళలోని మలప్పురం లోని తన ఇంట్లో 25 ఏళ్ల విష్ణుజ మరణించి కనిపించింది. ఈ కేసులో భర్త, వారి బంధువులు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime: తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఇంటిని వదిలేసి వచ్చిన 13 ఏళ్ల బాలికపై ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చెన్నైలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడు కూడా తనని పెళ్లి చేసుకుంటానని అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. జనవరి 25న, బాలిక తల్లి మైలాపూర్ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుంచి తన కుమార్తె కనిపించడం లేదని చెప్పింది.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో మీరట్ గ్యాంగ్ రేప్, హత్య ఘటన సంచలనంగా మారింది. ఒక వ్యక్తి తన మరదలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు దారుణంగా హత్య చేశాడు. దీని కోసం ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లని నియమించుకున్నాడు. వీరంతా కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, గొంతుకు నులిమి, కాల్చి చంపారు.
Shocking: తమిళనాడు తంజావూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రభుత్వ మహిళాకళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో టాయిలెట్‌కి వెళ్లిన విద్యార్థిని బిడ్డను ప్రసవించింది. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు బిడ్డను చెత్తబుట్టలో పారేసింది. యూట్యూబ్‌లో చూస్తే బొడ్డు పేగుని కోసి పాపను చెత్తకుండిలో విసిరేసి క్లాస్ రూంకి తిరిగి వచ్చింది.
Awadhesh Prasad: ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అయోధ్య కూడా ఈ ఫైజాబాద్ ఎంపీ పరిధి కిందకే వస్తుంది. గతేడాది ఫైజాబాద్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరుపున గెలిచిన అవధేశ్ ప్రసాద్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే, ఆయన దళిత యువతి అత్యాచారం, హత్యపై భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యకు సమీపంలో అత్యాచారం చేసి, హత్యకు గురైన 22 ఏళ్ల దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని ఆదివారం విలేకరుల సమావేశంలో విలపించారు.
Toll fee: టోల్ ఫీజు ఎగ్గొట్టడానికి ఓ బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. టోల్ ప్లాజాలో ఆపకుండా వేగంగా బస్సుని నడిపాడు. బస్సుని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టోల్ సిబ్బందిలో ఒకరిని బస్సుతో తొక్కించాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఘమ్రోజ్ ప్లాజా వద్ద జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Read Also: […]
Sonia Gandhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్‌కి ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదిలా ఉంటే, రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. Read Also: Maha Kumbh Mela: కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం.. 16,000 […]
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మహా కుంభమేళాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి ప్రభుత్వం. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు అలర్ట్ అయ్యారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండవచ్చేని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Groom Dance: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికొడుకు చేసిన డ్యాన్స్ ఏకంగా వివాహం రద్దు అయ్యేలా చేసింది. ప్రముఖ బాలీవుడ్ సాంగ్ ‘‘చోలీకే పీచే క్యాహై’’కి వరుడు డ్యాన్స్ చేయడం వధువు తండ్రికి నచ్చలేదు.
Waqf bill: సోమవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వక్ఫ్ బిల్లుని ఆమోదించింది. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి నివేదికను సమర్పించారు. బిజినెస్ లిస్ట్ ప్రకారం.. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జే