PM Modi: కేంద్ర బడ్జెట్ 2025 ‘‘ప్రజల బడ్జెట్’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని బడ్జెట్ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ పెట్టుబడుల్ని పెంచుతుందని, ఇది ‘‘వికసిత భారత్’’ లక్ష్యానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయపన్ను లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ బడ్జెట్ ప్రజల పొదుపుని పెంచుతుందని చెప్పారు. “ఈ బడ్జెట్‌లో, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేశారు. అన్ని ఆదాయ వర్గాలకు, పన్నులు తగ్గించబడ్డాయి. ఇది మన మధ్యతరగతికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇటీవల శ్రామిక శక్తిలో చేరిన వారికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది.’’ అని అన్నారు.
Read Also: Janhvi Kapoor : కండోమ్ యాడ్‌కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ ఛాయిస్.. ప్రముఖ వ్యాపారవేత్త వైరల్ కామెంట్
దేశ పురోగతికి దోహదపడే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ని ఆమె టీంని ప్రధాని మోడీ అభినందించారు. ఈ బడ్జెట్ పర్యటక, ఆతిథ్య రంగం, నౌకా నిర్మాణం, సముద్ర పరిశ్రమలకు దేశవ్యాప్తంగా రైతులకు సాయపడుతుందని అన్నారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వబడిందని, రాబోయే కొన్నేళ్లలో అనేక పెద్ద సంస్కరణ గురించి చర్చించాలనుకుంటున్నానని, నౌకానిర్మాణానికి ‘‘పరిశ్రమ హోదా’’ ఇవ్వడాన్ని గురించి నొక్కి చెప్పారు.
గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతా చర్యల అవార్డును ప్రధానమంత్రి ప్రస్తావించారు, ఇది శ్రమ గౌరవానికి తన ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుందని అన్నారు. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ను రూ. 5 లక్షలకు పెంచడం రైతులతో సహా వ్యవసాయ రంగానికి మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త విప్లవానికి ఆధారం అవుతుందని ఆయన చెప్పారు.