Wife harassment: తప్పుడు ‘‘వరకట్న వేధింపులు’’ భర్తల ఆత్మహత్యలకు కారణమవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో భార్య వేధింపులు భరించలేక ఓ ఫోటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె ముగ్గురు బంధువుల కారణంగా ఈ చర్యకు పాల్పడ్డాడని, వారిపై కేసులు నమోదు చేసినట్లు గురువారం ఒక పోలీస్ అధికారి తెలిపారు. ‘‘వరకట్న నిషేధ చట్టాలను’’ మహిళలు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం మార్పులు చేయాలని కోరుతూ.. నితిన్ పడియార్(28) జనవరి 20న ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. Read Also: […]
Bangladesh: మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది.
Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు […]
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్‌లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్‌గా గుర్తించారు.
HMPV Virus: చైనాలో ప్రారంభమైన HMPV దేశాన్ని కూడా కలవరపెట్టింది. చైనాలో భారీగా కేసులు నమోదు కావడం, మరోసారి కోవిడ్ మహమ్మారిని గుర్తుకు తెచ్చింది. ఇదిలా ఉంటే, HMPV వైరస్ కేసులు కూడా భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళల్ని పెంచాయి. అయితే, నిపుణులు దీనిని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. Read Also: CM Revanth Reddy : రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు పాఠశాల విద్యలో AI ఆధారిత డిజిటల్ విద్య ఇదిలా […]
US Mid Air Accident: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్లు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ని గాలిలోనే ఢీకొట్టింది.
S Jaishankar: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ని ‘‘అమెరికన్ జాతీయవాది’’గా జైశంకర్ అభివర్ణించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో గురువారం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దౌత్య స్వభావం, భారతదేశం విధానాన్ని గురించి చెప్పారు.
Teenage pregnancy: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్రెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 2021-22 నుంచి 2023-24 వరకు ఏకంగా 33,621 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
Maha Kumbh Mela: ‘‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్ల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ‘‘వేప పుల్లలు’’ అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. భక్తులు తమ దంతాలను శుభ్రపరుచుకోవడానికి సదరు యువకుడి వద్ద నుంచి పుల్లలను కొనుగోలు చేస్తున్నారు.
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్