AMU: ప్రధాని మోడీ, సీఎం యోగిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు.. టీచర్ అరెస్ట్..
- ప్రధాని మోడీ, సీఎం యోగిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు..
- ఏఎంయూ లెక్చరర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AMU: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ‘‘అసభ్యకరమై వ్యాఖ్యలు’’ చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU) గెస్ట్ లెక్చరర్‌ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జనవరి 11 రాత్రి అతడికి, ఏఎంయూ భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొనబడింది. ఈ సంఘటనపై ఏఎంయూ అధికారులు సంస్కృత విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అరిమందన్ సింగ్ పాల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Read Also: Hamas-Israel: రేపు మరో ముగ్గురు బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటన
Also Read
ప్రాథమిక దర్యాప్తు తర్వాత పాల్ తాత్కాలికంగా రిలీవ్ అయ్యారని ఏఎంయూ ప్రతినిధి ప్రొఫెసర్ విభా శర్మ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక కాంగ్రెస్ యూత్ లీడర్ రాజా భయ్యా, పాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు, గొడవను చూసిన విద్యార్థులు పాల్‌ని నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లాని ప్రయత్నించారు. అతను తాగి ఉన్నాడో లేదో అని పరీక్షించడానికి ప్రయత్నించిన సందర్భంలో పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రధాని, సీఎం, యూనివర్సిటీ అధికారులపై అసభ్యకరమైన భాష ఉపయోగించడంపై అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!