Working hours: ‘‘వారానికి 55-60 గంటలు పనిచేస్తే ఇక అంతే’’.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు..
- వారానికి 55-60 గంటలు పనిచేస్తే ఆరోగ్యంపై ప్రభావం..
- పని గంటల డిబేట్ మధ్య ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Working hours: ఇటీవల పలు సంస్థల సీఈఓలు, కీలక అధికారులు ఉద్యోగులు పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఉద్యోగి వారానికి 70-90 గంటలు పనిచేయలనే వాదన నేపథ్యంలో బడ్జెట్ ముందు కేంద్రం తీసుకువచ్చిన ‘‘ఆర్థిక సర్వే’’ కీలక విషయాలను చెప్పింది. వారానికి 55-60 గంటల కన్నా ఎక్కువ పనిచేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. పలు అధ్యయనాలను ఉటంకిస్తూ.. డెస్క్ వద్ద ఎక్కువ గంటలు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు హనికరమని పేర్కొంది. డెస్క్ వద్ద ప్రతీ రోజూ 12 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు గడిపే వ్యక్తులు మానసిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పింది.
‘‘ సాధారణంగా పనిగంటలను ఉత్పాదకతకు కొలమానంగా పరిగణిస్తారు. మునుపటి అధ్యయనం వారానికి 55-60 గంటలు దాటితే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారి తీసింది. ’’ అని డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం ‘‘వర్క్-రిలేటెడ్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ’’ ఫలితాలను ఉటంకిస్తూ ఎకనామిక్ సర్వే తెలిపింది. మరో అధ్యయనం అయిన ‘‘సేపియన్ ల్యాబ్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్’’ డేటాని హైలెట్ చేస్తూ.. డెస్క్ వద్ద ప్రతీ రోజు 12 గంటలు అంతకన్నా ఎక్కువ గడిపే ఉద్యోగుల్లో మానసిక శ్రేయస్సు దెబ్బతింటుంది.’’ అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్, ఆందోళన కారణంగా ఏటా సుమారు 12 బిలియన్ రోజుల్ని కోల్పోతున్నామని, ఇది 1 ట్రిలియన్ డాలర్లకు సమామని డబ్ల్యూహెచ్ఓ చేసిన ఓ అధ్యయనాన్ని ఎకనామిక్ సర్వే చెప్పింది.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
Read Also: DeepSeek: ఉద్యోగులెవరూ ‘‘డీప్ సీక్’’ ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.. యూఎస్ కాంగ్రెస్ నిషేధం..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పనిగంటలపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్, ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఇంట్లో కూర్చోకుండా ఆదివారాలు సహా వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు కూడా మండిపడ్డారు. తోటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. పని గంటల కన్నా పని నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమని చెప్పారు. మరో పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయెంకా కూడా పనిగంటలు విజయానికి సూచిక కాదని చెప్పారు. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. పనిగంటలు ముందు పై స్థాయి నుంచి అమలు చేయాలని సూచించారు. పని నాణ్యత ముఖ్యమని చెప్పారు.
తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!