Maha Kumbh: మహా కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. శనివారం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో కారు డివైడర్ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు నేపాలీలు మరణించారు. మధుబని నాలుగు లేన్ల బైపాస్‌లో వేగం వెళ్తున్న కారు, బైక్‌ని తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది. స్టంట్స్ చేస్తున్న బైకర్ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే, తనతో సంబంధాన్ని తెంచుకుందని 30 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. నందన్వన్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన తర్వాత, బాధితుడు సాగర్ మిశ్రాని ఆస్పత్రిలో చేర్చారు. మిశ్రా తాగుడుకు బానిస కావడంతో 27 ఏళ్ల యువతి అతడితో సంబంధాన్ని తెంచుకుంది.
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికిపోతోంది. గత 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు.
India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్‌కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి.
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్‌ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్‌బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
Delhi Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు వరసగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, నిన్న ఆప్‌కి రాజీనామా చేసిన 08 మంది ఎమ్మెల్యేలు నేడు (శనివారం) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో 08 మంది ఎమ్మెల్యేలు నిన్న ఆప్‌కి రాజీనామా చేశారు.
EV sector: కేంద్ర బడ్జెట్ 2025లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు(EV) పరిశ్రమలో లిథియం అయాన్ బ్యాటరీలు కీలకంగా ఉంటాయి. ఈ బ్యాటరీ తయారీలో ఉపయోగించే కీలకమై ఖనిజాలు, వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD)ని తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది.
Budget 2025: 2025 బడ్జెట్లో రక్షణ రంగానికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చి్ంది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 2025-26 బడ్జెట్లో ఢిఫెన్స్ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాది రూ. 6.2 లక్షల నుంచి 9.55 శాతం పెరుగుదల.