DeepSeek: అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మార్కెట్‌ని చైనా ఏఐ టూల్ ‘‘డీప్ సీక్’’ షేక్ చేసింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది.
PM Modi: బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు. Read Also: Rashtrapati Bhavan: సోనియాగాంధీ వ్యాఖ్యలను […]
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ జెట్ వేగంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో, వాటిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విడుదల చేశారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించడం, వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచడం, జన్మహక్కు(బర్త్ రైట్) పౌరసత్వాలను నిషేధిస్తూ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ కేసును ముగించడానికి డివిజన్ బెంజ్ విచారణ…
Tamil Nadu Doctor Rape Case:2022లో తమిళనాడులో ఓ మహిళా డాక్టర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు నలుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మహిళా కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇప్పుడు ఈ మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. తాజాగా కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణితో బహిష్కరించారు. ఆమెతో పాటు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరి నుంచి అఖాడా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది.
Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.