Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ముఖ్య సలహాదారుడిగా తన గుండా బిభవ్ కుమార్‌ని కేజ్రీవాల్ నియమించారని, పంజాబ్ నుంచి దోచుకున్న డబ్బుని ఢిల్లీకి తీసుకువస్తున్నడని మంగళవారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తనను తాను సరిదిద్దుకోవాలని లేకపోతే ఢిల్లీలో జరిగిందే పంజాబ్‌లో జరుగుతుందని హెచ్చరించారు.
Delhi court: బహిరంగంగా ‘‘పొట్టి దుస్తులు’’ ధరించడం నేరం కాదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. గత ఏడాది బార్లో అశ్లీల నృత్యం చేసినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురు బార్ డ్యాన్సర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చిన కోర్టు.. డ్యాన్స్ వల్ల ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది.
High Court: భర్త తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య నిర్లక్ష్యంగా ఆరోపించడం మానసిక క్రూరత్వానికి సమానమే అని కలకత్తా హైకోర్టు చెప్పింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని, నేటి సమాజంలో అక్రమ సంబంధంగా భావించలేము అని కోర్టు పేర్కొంది. క్రూరత్వం కారణంగా కుటుంబ కోర్టు తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించడంతో భర్త (పిటిషనర్) హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుని విచారిస్తూ, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందంటూ […]
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాదియా వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. రాజకీయంగా కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు. రాయ్‌గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం […]
Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. అనేక నిర్ణయాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన ఉక్రెయిన్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు’’ అని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీని కలవడానికి కొన్ని రోజులు ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
MP Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బంధువులే 19 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌లో జరిగింది. యువతి బంధువులే, పొరుగింటి వారి టెర్రర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Modi: పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రమాదాలు, పక్షపాతం గురించి ఆందోళన లేవనెత్తారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో జాగ్రత్తగా, సహకారంతో కూడిన ప్రపంచ పాలన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజం వంటి కీలక రంగాలను ఏఐ ఎలా పునర్నర్మిస్తుందనే విషయాన్ని హైలెట్ చేశారు.