Venu Goapl Reddy
Author- NTV Telugu-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
CNG Biogas Blending: దేశంలో CNG వాహనాలకు సంబంధించి కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG)ను కలిపే విధానాన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన అధికారిక వీడియోలో వివరించింది. దీంతో CNGలో బయోగ్యాస్ మిశ్రమం కలపడంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెట్రోల్ లో 20 శాతం ఇథనాలు కలుపుతున్నారు. ఈ E20 పెట్రోల్‌పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) అంటే ఏమిటి..? […] -
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌కు తన స్థానమేంటో చూపించింది భారత్. భారత సైన్యం చేసిన దాడులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అయితే, ఈ ఆపరేషన్ గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఇటీవల పదవీ విమరణ పొందిన ఎయిర్ కమోడోర్ ఖాలిద్ చిష్టి సంచలన విషయాన్ని బయటపెట్టారు. భారత దాడుల సమయంలో పాకిస్తాన్ తన మొత్తం ఎఫ్-16 యుద్ధ విమానాలను దాడి పెట్టిందని చెప్పారు. భయం […] -
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
Study Abroad: భారతీయ విద్యార్థుల్లో విదేశీ చదువుల పట్ల మోజు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లలో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేంద్రం హోంశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ (BoI) గణాంకాల ప్రకారం.. 2023లో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య 8,94,758గా ఉంది. ఈ సంఖ్య 2024లో 7,60,060కి, 2025లో మరింత తగ్గి 6,19,264కి చేరింది. అంటే 2023తో పోలిస్తే రెండేళ్లలో దాదాపు 31 శాతం తగ్గుదల నమోదైంది. ఇదిలా […] -
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
Bangladesh: బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా 10-16 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా దేశవ్యాప్తంగా దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమలు చేస్తోంది. విద్యుత్ కొరత కారణంగా ఇకపై బంగ్లాదేశ్‌లోని దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దేశంలోని అన్ని బిల్ బోర్డులను సాయంత్రం […] -
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
Donald Trump: అమెరికా-ఇరాన్ యుద్ధానికి కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అల్లా దయతో హార్ముజ్‌పై అమెరికా ‘‘పూర్తి నియంత్రణ’’ సాధించిందని ప్రకటించారు. అమెరికా నేవీ దిగ్భందాన్ని పలువురు ‘‘ఉక్కు గోడ’’గా పిలుస్తున్నారని, దాన్ని కొనసాగిస్తామని ట్రంప్ అన్నారు. ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో బలమైన దేశంగా ఉన్న ఇరాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం […] -
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
Rajya Sabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ వాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ‘‘లుంగీ వాలా’’ అని పిలిచారని ఆరోపించడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అయితే, తాను ఈ పదాన్ని ఉపయోగించలేదని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. సోమవారం సభలో ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్‌పై చర్చ సందర్భంగా తాను మాట్లాడుతున్నప్పుడు సుస్మితా పలుమార్లు లుంగీవాలా అని పిలిచారని బ్రిట్టాస్ ఆరోపించారు. తాను మలయాళీగా, దక్షిణ […] -
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
Air India Flight: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాలిలోనే తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఏకంగా విమానం 300 అడుగులకు పడిపోయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం AI2379 ప్రమాదంపై దర్యాప్తు మరింత వేగవంతమైంది. విమానం ఢిల్లీలో ల్యాండైన తర్వాత రూపొందించిన మెయింటనెన్స్ రిపోర్టులో స్వల్ప వ్యవధిలోనే 3 హైడ్రాలిక్ ప్రెజర్ అలర్ట్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బస్ A320 (VT-EXO) విమానంలో గ్రీన్, ఎల్లో, బ్లూ హైడ్రాలిక్ వ్యవస్థల్లో […] -
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
Solar Eclipse 2026: 2026లో రెండో సూర్యగ్రహణం ఈరోజు (ఆగస్టు 12)న సంభవించనుంది. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. గ్రహణం రాత్రి 9:04 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11:16 గంటలకు గరిష్ఠ దశకు చేరుకుని, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నాయి. దేశంలో ఈ గ్రహణం కనిపించదు, కాబట్టి సూతల కాలం వర్తించదు. అయినప్పటికీ జ్యోతిష్యుల ప్రకారం, గ్రహ స్థానాలు, గోచారాల ఆదారంగా ఈ గ్రహణం అన్ని రాశుల వారిపై […] -
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
Delhi: ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం చెలరేగింది. ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో పుర్రె కనిపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో తనిఖీ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అందులో పుర్రె బయటపడింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని ప్రశ్నించగా, అది కోతి పుర్రె అంటూ సమాధానం ఇచ్చారు. పుర్రెను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ కోసం […] -
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
Retail Inflation: భారతదేశంలో రిటైల్ ద్రవ్యల్బణం జూలై నెలలో తీవ్రంగా పెరిగింది. బుధవారం విడుదల చేసిన ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. పెరిగిన ఆహార, నిత్యావసర ధరల కారణంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ లోని 4.38% నుండి జూలై 2026 నాటికి 4.45%కి పెరిగింది. ఇది ఆర్బీఐ అంచనా 4 శాతం మధ్యకాలిక లక్ష్యాన్ని అధిగమించింది. నెలవారీ ప్రాతిపదికన సాధారణ CPI సూచీ 0.9 శాతం పెరగగా, ఆహార ధరల సూచీ […]
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!