Shashi Tharoor: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్‌లో అసంతృప్తిని పెంచుతోంది.
USA: అమెరికాలో చాలా మంది భారతీయులు ముఖ్యంగా H1B వీసాలపై పనిచేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. వీరి వల్లే తమకు ఉపాధి లభించడం లేదని ఆరోపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ధోరణి మరింత ఎక్కువగా పెరిగింది. ఇదిలా ఉంటే, యూఎస్‌లో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, యూఎస్ పోల్‌స్టర్‌గా ప్రసిద్ధి చెందిన మార్క్ మిచెల్ కూడా భారతీయులపై నోరు పారేసుకున్నాడు. ఆపిల్ వంటి టెక్ కంపెనీల్లో H1B వీసాలపై పనిచేస్తున్న భారతీయుల్ని తిరిగి పంపాలని, […]
PM speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మోడీ, ట్రంప్‌లు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, ఎనర్జీ, డిఫెన్స్ రంగాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
Pak Boat Seize: భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవను భారతీయ తీర రక్షక దళం (ICG) స్వాధీనం చేసుకుంది. భారత జలాల్లో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌తో సహా అందులో ఉన్న 11 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. తదుపరి విచారణ కోసం వీరిని గుజరాత్‌లోని జఖౌ మెరైన్ పోలీసులకు అప్పగించారు.
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్ధి, ఢిల్లీ ట్రయల్ కోర్టు జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తన సోదరి వివాహానికి హాజరు కావడానికి రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. కోర్టు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రూ. 20,000 వ్యక్తిగత బాండ్‌పై, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ మధ్యంతర […]
Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు.
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ప్రక్రియపై బుధవారం పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర వాడీవేడి చర్చ జరిగింది. అయితే, దీనిపై గురువారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమిత్ షాను ఉద్దేశిస్తూ, బీజేపీ నాయకుడు ‘‘ఒత్తిడి’’లో ఉన్నట్లు కనిపించారని అన్నారు. ‘‘నిన్న పార్లమెంట్లో అమిత్ షా జీ చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన చేతులు […]
RSS: తమిళనాడులో తిరుప్పరంకుండ్రంలోని ‘‘సుబ్రమణ్య స్వామి’’ ఆలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొండపై ఉన్న ఆలయ స్తంభం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, డీఎంకే ప్రభుత్వం మాత్రం కొండ కింద ఉన్న దీపం వెలిగించేందుకే అనుమతి ఇచ్చింది. మరోవైపు, కుమారస్వామి భక్తులు మాత్రం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇటీవల ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇదిలా ఉంటే, ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి స్వామినాథన్‌ను తొలగించాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేలు కలిసి […]
SIR: కేంద్రం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పొడగించినట్లు ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో గడవును పొడగించింది.
Mamata Banerjee: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి సర్ ప్రక్రియను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో మహిళల పేర్లు తొలగిస్తే, వారంతా వంటగదిలో వాడే పనిముట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల […]