Amit Shah: పార్లమెంట్ ‘‘ఓట్ చోరీ’’ అంశంపై దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఓట్ చోరీపై తనతో సభలో చర్చకు సిద్ధమా అంటూ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై చర్చించేందు అమిత్ షా భయపడుతున్నారని అన్నారు. హర్యానాలో 19 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే, దీనికి ప్రతిగా నా ప్రసంగంలో నేను ఎప్పుడు ఏది మాట్లాడాలో మీరు నిర్ణయించలేరని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ సహనంతో ఉండాలని షా హితవు పలికారు. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను మన్మోహన్ సింగ్ హయాంతో కూడా చేసిందని అమిత్ షా గుర్తు చేశారు.
Read Also: New Kia Seltos: కొత్త అవతార్‌లో “కియా సెల్టోస్”, సియెర్రాకు టఫ్ కాంపిటీషన్ గ్యారెంటీ..
గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేయలేదని షా అన్నారు. తమ హయాంలో విపక్షాలు అన్ని చోట్ల గెలిచాయని చెప్పారు. నిజానికి ఓట్ చోరీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని షా ఆరోపించారు. స్వాతంత్ర్యానికి ముందు సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికీ, నెహ్రూ ప్రధాని అయ్యారని చెప్పారు. ఇందిరా గాంధీ రాయ్‌బరేలీలో గెలిచినప్పుడు రెండోసారి ఓట్ చోరీ జరిగిందని, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. సోనియాగాంధీ భారతదేశ పౌరురాలు కాకముందే ఓటర్ అయ్యారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని ఆయన అన్నారు.