Vijay: టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్‌ని ‘‘కరూర్ తొక్కిసలాట’’ గురించి ఈ రోజు(సోమవారం) సీబీఐ విచారించింది. ఆరు గంటల పాటు విచారణ జరిగింది. దీంతో ఆ తొక్కిసలాటకు తన పార్టీ బాధ్యత వహించదని సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ బహిరంగ ర్యాలీకి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. ఈ సమయంలోనే తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది.
Read Also: Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు
ఈ కేసులో మరోసారి విజయ్‌ను విచారణ నిమిత్తం పిలుస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. అతడి వాంగ్మూలాన్ని పోలీసుల నివేదికలతో సరిపోల్చి చూస్తామని చెప్పారు. ‘‘విజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. పొంగల్ పండగ కారణంగా అతను విచారణ వాయిదా వేయాలని కోరాడు. కాబట్టి రేపు అతడికి సమన్లు పంపరు. పొంగల్ తర్వాత అతడికి సమన్లు పంపే అవకాశం ఉంది’’ అని సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఈ దుర్ఘటనకు కారణం, ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే అని తమిళనాడు పోలీసులు చెప్పారు. ఆలస్యం కారణంగా చెలరేగిన గందరగోళంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ కారణంగా జనాలను చాలా మంది రావడం, నియంత్రించే పరిస్థితులు చేయి దాటిపోయినట్లు చెప్పారు. అయితే, ఈ ఆరోపణలను విజయ్, ఆయన పార్టీ ఖండించింది. ఈ తొక్కిసలాటలో అధికార పార్టీ డీఎంకే కుట్ర ఉందని ఆరోపించింది. రద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమైనట్లు చెప్పారు.