Allu Aravind: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో చిరంజీవి పూర్తి వింటేజ్ లుక్‌లో, కామెడీ టైమింగ్‌తో, మాస్ ఎనర్జీతో తిరిగొచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
READ ALSO: Telangana : ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. DA/DR పెంచుతూ ఉత్తర్వులు
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాస్ ఈజ్ బాస్.. చించేశాడు’ అంటూ చిరంజీవి నటన, డ్యాన్స్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. మళ్లీ ఆ ఓల్డ్ రౌడీ అల్లుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన ఎగ్జైట్‌మెంట్ మళ్లీ ఈ చిత్రం చూస్తున్నప్పుడు కలిగిందన్నారు. వెంకటేష్ గారి ఎంట్రీ, చిరంజీవి.. వెంకటేష్ గారి కాంబినేషన్ అదిరిపోయాయి. సినిమా ఎక్సలెంట్, జనానికి పైసా వసూల్ ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో బాస్ చించేశాడు’ అని చెప్పారు.
READ ALSO: Shocking Incident: ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు.. ‘మనిషి మాంసం తినాలని హత్య’