Waqf Bill: ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం ముందుగా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి, చర్చించనున్నారు. ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఎంఐఎం వంటి ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మరోసారి భారత్‌కి స్నేహ సందేశం పంపాడు. భారత్ , చైనాలు మరింత దగ్గరగా కలిసి పనిచేయాలని అన్నారు. చైనా అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో మాట్లాడారు. రెండు దేశాల ప్రస్తావిస్తూ.. డ్రాగన్-ఏనుగు డ్యాన్స్ చేయాలని అన్నారు. ‘‘డ్రాగన్-ఏనుగు టాంగో’’ రూపంలో ఉండాలని చెప్పారు.
Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రేపు, ఉదయం ఇండీ కూటమి ఎంపీలతో […]
Northeast: బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ తన చైనా పర్యటనలో ‘‘ఈశాన్య రాష్ట్రాల’’ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చైనాను బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూనే, భారతదేశానికి చెందిన ఏడు సిస్టర్ స్టేట్స్(ఈశాన్య రాష్ట్రాలు) ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని,
Yogi Adityanath: బీజేపీలో 75 ఏళ్ల వయో పరిమితి పదవులకు అడ్డంకిగా మారింది. దీనిని చూపుతూ పలువురు సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్‌లో రిటైర్ అవబోతున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వాదనల నేపథ్యంలో మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Waqf Bill: వక్ఫ్ బిల్లు బుధవారం లోక్‌సభ ముందుకు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును విమర్శిస్తున్నాయి. ముస్లింల హక్కుల్ని కాలరాసే బిల్లుగా అభివర్ణిస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇదిలా ఉంటే, వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తున్న తరుణంలో, బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండియా కూటమి […]
Supreme Court: ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. బుల్డోజర్ యాక్షన్‌పై ప్రయాగ్‌రాజ్ పరిపాలన విభాగాన్ని తీవ్రంగా విమర్శించింది. కూల్చివేత చర్య ‘‘రాజ్యాంగ విరుద్ధం’’, ‘‘అమానవీయ’’ అని పేర్కొంది. బుల్డోజర్ యాక్షన్ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Sanjay Raut: ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ విరుచుకుపడుతున్నారు. మోడీ సెప్టెంబర్‌లో రిటైర్ అవుతారని, అందుకే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన ఈ రోజు మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రౌత్ మాట్లాడుతూ.. మోడీ కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, ఎవరికి బాస్ కాదని అన్నారు. దశాబ్దాలుగా పనిచేసిన అద్వానీ వంటి అగ్ర నేతల కారణంగా బీజేపీ అధికార శిఖరానికి చేరుకుందని అన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్‌ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Waqf bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.