Waqf Bill: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ముస్లింలకు ప్రయోజనకరం కాకుండా హానికరంగా ఉంటుందని పేర్కొంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్ వార్నింగ్ ఇచ్చారు.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభ ముందుంచారు. రిజిజు ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ ఇచ్చేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన […]
Waqf Bill: ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని కేంద్రం ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్‌సభ ముందు ఉంచారు. బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులో భాగం కానీ అంశాలపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు […]
LoC: భారత్‌ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
Maoist: వరస ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 100కు పైగా మావోయిస్టులు హతమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ప్రతీ ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోలు హతమయ్యారు.
Ghibli: భారత్, ఇజ్రాయిల్ మధ్య స్నేహానికి గుర్తుగా ఇండియాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల ‘‘ఘిబ్లీ’’ ఇమేజ్‌లను షేర్ చేసింది. మార్చి 31న ప్రధాని మోడీ, నెతన్యాహూల ఫోటోని ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం నుంచి ఈ పోస్ట్ వచ్చింది.
BJP: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కొత్త చీఫ్ రాబోతున్నారు. ఏప్రిల్ మూడో వారం నాటికి బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 4న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఊపందుకుంటుందని తెలుస్తోంది.
Waqf amendment bill: ఎన్డీయే ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’కు మిత్ర పక్షాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే, టీడీపీ, జనసేన పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు.
Ratan Tata: రతన్ టాటా, భారత దేశం ఉన్నంత కాలం ఈ పేరు చిరస్మరనీయంగా ఉంటుంది. అంతటి సేవా గుణానికి ప్రతీక. దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందేందుకు అనేక చర్యలు తీసుకున్న పారిశ్రామికవేత్త. గతేడాది చనిపోయిన రతన్ టాటా ఔదార్యం మరోసారి వెల్లడైంది. తన వీలునామాలో రూ. 3800 కోట్ల ఆస్తిని దాతృత్వానికి ఇచ్చారు.
Waqf Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చించనున్నారు. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగుతుంది. ప్రతీ సభలో చర్చించడానికి 8 గంటలు కేటాయించారు.