Venu Goapl Reddy
Author- NTV Telugu-
AIADMK: ఎన్డీయే కూటమిలోకి ఓపీఎస్, దినకరన్..? హింట్ ఇచ్చిన అన్నాడీఎంకే..
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నాడీఎంకే పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు, పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), టీటీవీ దినకరన్‌లు మళ్లీ ఎన్డీయే గూటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా సాంప్రదాయ అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ […] -
Pakistan: ఛీ ఇదేం పని రా.. మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ ప్రతినిధి..
Pakistan: నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటుతున్నట్లు చూపించే వీడియో వెలువడిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read Also: Pinaka Mk4 Missile: ఇక […] -
YouTube: ‘‘యూట్యూబ్’’లో చూసి, మహిళకు ఆపరేషన్ చేసి చంపేశారు..
YouTube: యూట్యూబ్, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడి సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీలో ఒక మహిళకు యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె చనిపోయింది. అక్రమంగా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, అతడి మేనల్లుడు యూట్యూబ్ ట్యుటోరియల్‌లో చూసిన తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది. Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. […] -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. బెర్లిన్ టూర్‌పై బీజేపీ విమర్శలు..
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. -
Saudi Arabia: సౌదీలో నాన్-ముస్లింలకు ‘‘మద్యం’’.. కానీ, ఒక్క కండిషన్..
Saudi Arabia: ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఇస్లాంకు పుట్టినిల్లుగా ఉన్న సౌదీ అరేబియా కూడా మారాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సౌదీ ప్రభుత్వం మధ్యం కొనుగోలు నిబంధనల్ని కొంచెం సడలించింది. నెలకు 50,000 రియాల్స్ ($13,300) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులు మద్యం కొనుగోళ్లు చేయడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Pakistan: పాక్‌లో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ డిమాండ్.. మోడీ, యూఎన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. -
Microsoft: భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి.. పీఎం మోడీతో సత్య నాదెళ్ల భేటీ..
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిన ఇండియాలో పెడుతున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇది భారతదేశ ఆశయాలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. భారతదేశ ‘‘AI ఫప్ట్ ప్యూచర్’’ నిర్మించేందుకు, డెవలప్ చేసేందుకు $17.5 బిలియన్లు( రూ. 1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. -
Arunachal Pradesh: అక్రమ బంగ్లాదేశీయులపై తిరగబడుతున్న అరుణాచల్ ప్రజలు..
Arunachal Pradesh: బంగ్లాదేశీయు అక్రమ చొరబాట్లపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలోని ఒక మసీదును తొలగించడంతో పాటు అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు స్థానిక సంస్థలు మంగళవారం రాజధాని ఇటానగర్ ప్రాంతంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. -
K Annamalai: డీఎంకే, ఇండియా కూటమి ‘‘హిందూ వ్యతిరేకులు’’.. సుబ్రమణ్య స్వామి ఆలయం వివాదంపై అన్నామలై..
K Annamalai: తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదంగా మారింది. ఇటీవల మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని తీర్పు చెప్పారు. అయితే, ఈ తీర్పును ప్రభుత్వం పాటించలేదు. -
Rahul Gandhi: గాంధీ హత్య తర్వాత, “ఆర్ఎస్ఎస్” అన్ని సంస్థల్ని ఆక్రమించుకుంటోంది..
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!