Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సెప్టెంబర్ నెలలో నరేంద్రమోడీ రిటైర్ అవబోతున్నారని ఆయన కామెంట్స్ చేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రౌత్ వాదనల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2029 ఎన్నికల తర్వాత కూడా మోడీ ప్రధాని పదవిలో కొనసాగుతారని చెప్పారు.
Guru Gochar 2025: జ్యోతిష్యంలో గురు గ్రహానికి ఉన్న ప్రాధాన్యత మరే గ్రహానికి ఉండదు. కొన్ని గ్రహాలు సరైన స్థానంలో లేకున్నా, గురు గ్రహం వ్యక్తి జాతకంలో మంచి స్థానంలో ఉంటే వాటి నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తప్పించుకోగలడు. దేవతల గురువుగా చెప్పబడే గుర గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానానికి, సంపద, అదృష్టం, వివాహం, దేవుడి దృష్టి వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
Shani Gochar 2025: జ్యోతిష్యంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శనిని కర్మ కారకుడిగా భావిస్తారు. శని ఒక్కో ఇంట్లో రెండున్నర ఏళ్లు ఉంటారు. 2025లో శని కుంభం నుంచి మీనంలోకి మారుతున్నాడు. రెండున్నరేళ్ల పాటు ఇక్కడే శని సంచరిస్తారు. శని గ్రహం ప్రతీ మనిషిని కష్టపడేలా చేస్తాడు, మనల్ని పరీక్షిస్తుంటాడు. ఎవరు మనవారు, ఎవరు కాదు అనే విషయాలను శని యోగంలోనే తెలుసుకోగలము. అయితే, 2025లో మూడు గ్రహాలకు శని గ్రహ గోచారం యోగిస్తుంది.
Vishwavasu Nama: ఉగాదితో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. మొత్తం 60 సంవత్సరాల్లో విశ్వావసు ఒకటి. ‘‘విశ్వావసు’’ అంటే సమృద్ధి అని అర్థం. ప్రజల వద్ద ఏది ఉంటే సంతోషంగా ఉంటారో, దానిని ఇచ్చే సంవత్సరంగా దీనిని చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం,
Ugadi Rasi phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరు కూడా తమ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది గ్రహ పరిస్థితులు కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం రావడం, ప్రమోషన్లు రావడం వంటివి జరగబోతున్నాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని దర్శించిన ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్కి, ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని సౌదీ అరేబియా, […]
MK Stalin: తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు చిగురించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ భేటీపై సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లు ముస్లింల హక్కుల్ని హరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
UP Bans Meat Sale: యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండగ సందర్భంగా, మతపరమైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకాలను నిషేధించింది. అక్రమ వధశాలలను మూసేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులన రాష్ట్రవ్యాప్తంగా మాంసం అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. Read Also: […]
Porn Racket: నోయిడాలో భార్యభర్తలు నడిపిస్తున్న ‘‘పోర్న్ రాకెట్’’ బట్టబయలైంది. అంతర్జాతీయంగా ఈ రాకెట్‌కి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ ఇద్దరు గత 5 ఏళ్లుగా ఈ రాకెట్ నడుపుతున్నారు. భారీగా విదేశీ నిధులతో ఈ రాకెట్‌కి సంబంధాలు ఉన్నాయి.