Lava Blaze Duo 3 Launch: భారతీయ మొబైల్ తయారీ సంస్థ ‘లావా’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘లావా బ్లేజ్ డుయో 3’ని ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. డ్యూయల్-స్క్రీన్ డిజైన్. ప్రత్యేకమైన డ్యూయల్ డిస్‌ప్లే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్లను ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
భారత్‌లో లావా బ్లేజ్ డుయో 3 ధర రూ.16,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ఒక్క వేరియంట్‌లోనే (6జీబీ+128జీబీ) అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ బ్లాక్, ఇంపీరియల్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచిత హోమ్ సర్వీస్ సౌకర్యాన్ని కూడా లావా సంస్థ అందిస్తోంది. డ్యూయల్-స్క్రీన్ ఫీచర్, బలమైన స్పెసిఫికేషన్లతో మిడ్-రేంజ్ విభాగంలో లావా బ్లేజ్ డుయో 3 మంచి ఎంపికగా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
లావా బ్లేజ్ డుయో 3లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో మరో ప్రత్యేక ఆకర్షణగా 1.6 ఇంచెస్ అమోలెడ్ సెకండరీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ చిన్న డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్లను చూడడమే కాకుండా.. మ్యూజిక్ కంట్రోల్స్ కూడా సాధ్యమవుతుంది. అలాగే వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసేటప్పుడు ఇది వ్యూ ఫైండర్‌గా కూడా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో వచింది. ఇది గరిష్టంగా 2.6GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని లావా తెలిపింది.
Also Read: Gautam Gambhir Trolls: గంభీర్ సర్.. ఇక మీ సేవలు చాలు!
లావా బ్లేజ్ డుయో 3 వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX752 కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది హోల్ పంచ్ డిస్‌ప్లే కట్‌ఔట్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా అందించారు. అదనంగా స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ కేవలం 7.55mm మందంతో స్లిమ్ డిజైన్‌లో ఉంది. మొత్తంగా మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఈ ఫోన్ ఆకట్టుకునేలా ఉంది.