Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మరోసారి భారత్‌కి స్నేహ సందేశం పంపాడు. భారత్ , చైనాలు మరింత దగ్గరగా కలిసి పనిచేయాలని అన్నారు. చైనా అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో మాట్లాడారు. రెండు దేశాల ప్రస్తావిస్తూ.. డ్రాగన్-ఏనుగు డ్యాన్స్ చేయాలని అన్నారు. ‘‘డ్రాగన్-ఏనుగు టాంగో’’ రూపంలో ఉండాలని చెప్పారు.
Read Also: Asaduddin Owaisi: అది ‘‘వక్ఫ్ బిల్లు’’ కాదు, ‘‘వక్ఫ్ విధ్వంస బిల్లు’’..
2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు నార్మల్ అవుతున్నాయి. తాజాగా, భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75వ ఏళ్లు అవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన అభినందను సందేశాలను పంపారు. పొరుగువారితో శాంతియుత సహజీవనం చేయడానికి మార్గాలను కనుగొనాలని, ప్రధాన అంతర్జాతీయ వ్యవహారాల్లో సమన్వయాన్ని మరింత పెంచుకోవడానికి, సరిహద్దు ప్రాంతాలలో శాంతిని సంయుక్తంగా కాపాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని జిన్‌పింగ్ అన్నారు.
రెండు దేశాలు సంయుక్తంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాలని జిన్‌పింగ్ అన్నారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కాపాడటానికి భారత్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జిన్‌పింగ్ అన్నారు. రెండు దేశాల స్నేహ సంబంధం ప్రపంచ శాంతికి, శ్రేయస్సుకు దోహదపడాలని కాంక్షించారు. రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు, గ్లోబల్ సౌత్‌లో కీలకంగా ఉన్నాయని జిన్‌పింగ్ అన్నారు.
2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. దౌత్య సంబంధాలు కనిష్టానికి చేరుకున్నాయి. ఇటీవల రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దుల్లో ఘర్షణకు కేంద్రాలుగా ఉన్న తూర్పు లడఖ్‌లో డెప్సాంగ్, డెమ్‌చోక్ నుంచి సైనికులు వెనక్కి వెళ్లారు. ఐదేళ్ల తర్వాత మోడీ, జిన్‌పింగ్ సమావేశమైన తర్వాత, చైనా తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా సుంకాలు భయం, అతిపెద్ద మార్కెట్‌గా ఎదుగుతున్న భారత్‌తో ఘర్షణ కన్నా మిత్రుత్వమే నయమని భావిస్తోంది.