Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?
- రేపు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..
- అడ్డుకునేందుకు ప్రతిపక్షాల వ్యూహాలు..
- ఎన్డీయే, ఇండియా కూటమి బలాబలాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బిల్లు బుధవారం లోక్‌సభ ముందుకు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును విమర్శిస్తున్నాయి. ముస్లింల హక్కుల్ని కాలరాసే బిల్లుగా అభివర్ణిస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇదిలా ఉంటే, వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తున్న తరుణంలో, బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలంతా రేపు సభకు హాజరు కావాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వక్ఫ్ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వక్ఫ్ బిల్లుపై చర్చించారు. దీంట్లో 14 సవరణల్ని ప్రవేశపెట్టారు. రేపు మధ్యాహ్నం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. లోక్‌సభలో 8 గంటల పాటు చర్చించనున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపనున్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Read Also: Supreme Court: “బుల్‌డోజర్ యాక్షన్”.. యూపీ సర్కార్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..
పార్లమెంట్‌లో బలాబలాలు..
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు పాస్ అవుతుందా..? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే, పార్లమెంట్‌లోని రెండు సభల్లో అధికార ఎన్డీయేకే బలం ఉంది. బిల్లు సులువుగా పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు 298 మంది ఎంపీల మద్దతు ఉంది, వ్యతిరేకంగా 233 మంది ఉన్నారు. తటస్థంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 122 మంది ఎన్డీయే సభ్యుల మద్దతు ఉండగా, వ్యతిరేకంగా ఇండీ కూటమికి చెందిన 116 మంది ఎంపీలు ఉన్నారు. ఎలా చూసినా, కూడా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం తప్పితే, బిల్లును అడ్డుకునే అవకాశమే కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!