Badminton coach: బెంగళూర్‌కి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్లో 7-8 మంది బాలిక అభ్యంతరకమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు హులిమావులోని బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత రెండు ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది.
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహిస్తామని ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) తెలిపింది. అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. పార్లమెంట్లో బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్జేపీలను విమర్శిస్తూ.. ఆ పార్టీల లౌకిక ముసుగు తొలగిపోయిందని పేర్కొంది.
MK Stalin: తమిళనాడు రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అయితే, డీలిమిటేషన్ గురించి తమిళ ప్రజల భయాలను తొలగించడానికి ప్రధాని మోడీ నుంచి హామీ కావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సీట్ల వాటా శాతం మారకుండా కసరత్తు చేయాలని కోరారు.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఒక వీధిలో నడిరోడ్డుపై భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 43 ఏళ్ల కృష్ణప్పగా గుర్తించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది.
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు.
UP: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని అతడి భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పేశారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్ తన కుమార్తె బర్త్ డేకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. Read Also: […]
IndiGo: త్రివేండ్రం నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో 5 ఏళ్ల చిన్నారి బంగారు గొలుసు కనిపించకుండా పోయింది. అయితే, ఇండిగో విమాన సిబ్బంది దొంగలించిందని ఆమె తల్లి ఆరోపించింది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ దొంగిలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 1న విమానం గాలిలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
Amit Shah: 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి విడిపిస్తామని మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బస్తర్ పాండు కార్యక్రమంలో జరిగిన సభలో షా ప్రసంగిస్తూ.. బస్తర్‌లో మావోయిజం అంతమయ్యే దళలో ఉందని, వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో ‘‘లాల్ ఆతంక్’’ పట్టు నుంచి విముక్తి చేయడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
Fake Doctor: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్‌ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు.