Waqf Bill: ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన చారిత్రాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారబోతోంది. పార్లమెంట్లో చర్చ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి. కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, ఎంఐఎం, టీఎంసీ వంటి ఇండీ కూటమి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అయింది.
Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీయూ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది.
Thane: క్యాన్సర్ పేషెంట్ అని చూడకుండా 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని మహారాష్ట్ర థానే పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం తెలిపారు. 29 ఏళ్ల నిందితుడిని బీహార్ నుంచి అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. బీహార్‌లో బాలిక కుటుంబం ఉన్న అదే గ్రామానికి చెందిన నిందితుడు రెండు నెలల క్రితం బద్లాపూర్‌లో వారి కోసం ఒక అద్దె వసతిని ఏర్పాటు చేశాడు. బాలిక చికిత్సకు సాయం చేశాడు.
USA: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించాడు. ట్రంప్ దెబ్బతో అమెరికన్లు సూపర్ మార్కెట్లకు పరుగు తీస్తున్నారు. విదేశీ వస్తువులపై సుంకాలు ప్రకటించిన కొన్ని రోజు తర్వాత, ధరలు తక్కువగా ఉన్నప్పుడే పలు వస్తువుల్ని కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. దీంతో స్టోర్లు, సూపర్ మార్కెట్ల ముందు రద్దీ పెరిగింది.
Shocking Video: అత్తగారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ కోడలు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ, మహిళ తరుపు బంధువులు భర్తపై, ఆమె తల్లిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. వృద్ధురాలు అని చూడకుండా కోడలు, తన అత్తని జట్టు పట్టి లాగి దాడి చేసింది. తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించినందుకు కోడలు ఈ దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఏప్రిల్ 4న సీసీటీవీలో రికార్డయ్యాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. శ్రీలంక-భారత్ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోడీ అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శనివారం ద్వీప దేశం ఈ అవార్డును అందించింది. ‘‘మిత్ర విభూషణ’’ పతకం ద్వారా శ్రీలంక మోడీని గౌరవించింది. ఇది స్నేహం, వారసత్వాన్ని సూచిస్తుంది. ప్రధాని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
PM Modi: మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక చేరుకున్నారు. శుక్రవారం కొలంబోలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రక్షణ, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
Earthquake: శుక్రవారం నేపాల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రాత్రి 7.52 నిమిషాలకు సంభవించింది, దాని కేంద్రం 20 కి.మీ లోతులో ఉనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
JDU: బీహార్‌లో ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉంది. ఈ సమయంలో జేడీయూ పార్టీ ‘‘వక్ఫ్ బిల్లు’’ కల్లోలంలో ఇరుక్కుంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి చెందిన మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా, మరో నేత పార్టీని వీడారు. తాజాగా, ఆ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్ పార్టీకి రాజీనామా చేశారు.
Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంట్లో పాస్ అయింది. కాంగ్రెస్, ఎస్పీ వంటి ఇండీ కూటమి పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. అయినప్పటికీ బీజేపీ కూటమికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు రెండు సభల్లో సులభంగా నెగ్గింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మొహహ్మద్ జావెద్ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. Read […]