Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారత్ ఆగ్రహానికి కారణమయ్యాయి. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడని, మా ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించవచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. Read Also: Chirutha Back Story: సాయి రామ్ శంకర్ మిస్సైన ‘చిరుత’ చరణ్ చేతికి.. అసలు కథ ఇదా! ఇదిలా ఉంటే, […]
Waqf Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని నెగ్గించుకుంది. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో మెజారిటీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ సహా సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, వామపక్షాలు,
Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్‌ని ఈ రోజు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారించేందుకు నో చెప్పింది. ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిన్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారడమే మిగిలింది. ఈ బిల్లు ముస్లింలకు మేలు చేకూరస్తుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా, ఇది ముస్లింల హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అన్నామలై నిర్ణయం షాక్‌కి గురిచేసింది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గత వారం అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలోనే అన్నామలై పార్టీ […]
Amandeep Kaur: ఇన్స్టాగ్రామ్ ఫేమ్ పంజాబ్ లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్ 17.71 గ్రాముల నిషేధిత హెరాయిన్ డ్రగ్‌తో పట్టుబడింది. ఆమెను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఒక రోజు తర్వాత గురువారం ఆమెను పంజాబ్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘‘ యుధ్ నషేయన్ విరుధ్’’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌర్ అరెస్ట్ జరిగింది.
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నంటున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకువచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు.
Bengaluru: బెంగళూర్‌లో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ కార్యకర్త అయిన వినయ్ సోమయ్య అనే వ్యక్తి తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కార్యకర్త టెన్నీరా మహీనా, ఎమ్మెల్యే ఎ ఎస్ సోమన్న, ఇతరుల వేధింపులే కారణమని, తప్పుడు కేసులో తనను ఇరికించినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహ్మద్ యూనస్, భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. థాయ్‌లాండ్ బ్యాంకాక్‌లో 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నాయకులు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సంబంధం అవసరారన్ని ప్రధాని మోడీ యూనస్‌కి తెలియజేశారు. అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో చెప్పారు.