UP: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని అతడి భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పేశారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్ తన కుమార్తె బర్త్ డేకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది.
Read Also: Rajamouli : జక్కన్న-మహేష్- ఓ పాస్ పోర్ట్.. అందుకే కదా కింగ్ అనేది!
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ ‘‘బ్లూ కలర్ డ్రమ్’’ పేరుతో బెదిరింపులు ఎక్కువయ్యాయి. భర్తలే కాదు, భార్యలు కూడా బ్లూ కలర్ డ్రమ్‌లకు భయపడుతున్నారు. తాజాగా, ఓ వివాహిత శుక్రవారం యూపీలోని అలీఘర్ ఉపర్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ‘‘ముస్కాన్ కేసు చాలా చిన్నది, మేము నిన్న డ్రమ్‌లో వేయము. మేము నిన్ను ఎక్కడో చోట విసిరేసి, ఆమె కోపంతో మమ్మల్ని వదిలి పారిపోయిందని చెబుతాం’’ అని తన భర్త తనను బెదిరిస్తున్నాడని సౌమయ్య సలీమ్ అనే వివాహిత ఫిర్యాదు చేసింది. ఆమె ఒక బీమా సంస్థలో పనిచేస్తోంది.
తన అనుమతి లేకుండా తన భర్త అశ్లీల ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడని ఆమె ఆరోపించింది. మీరట్ ముస్కాన్ కేసుకు సంబంధించిన వీడియోలు తనకు పంపుతూ తన భర్త నిరంతరం బెదిరిస్తున్నాడని చెప్పింది. ఏప్రిల్ 04న తను తీవ్రంగా కొట్టాడని, వేధింపులకు విసిగిపోయి పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. తన అత్తామామలు తన నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారని, డబ్బు ఇవ్వడానికి బదులుగా తన తండ్రి ఇంటిని నిర్మిస్తున్నందున తనను వేధిస్తున్నారని ఆరోపించింది. సౌమయ్యని ఫైసల్ అనే వ్యక్తి 2023లో పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటి నుంచి రోజూ తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
Aligarh News:
-महिला ने पति पर क्रूरता का आरोप।
पति पर मारपीट और हत्या की धमकी का लगाया आरोप।
पत्नी ने कहा पति भेजता है ड्रम वाली मुस्कान की वीडियो।
अलीगढ के ऊपरीकोट कोतवाली क्षेत्र की निवासी महिला बताई जा रही है।@aligarhpolice @myogiadityanath pic.twitter.com/KGGfjNH1oc
— Newstrack (@newstrackmedia) April 4, 2025