స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దావోస్‌లో ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ’ , ‘తెలంగాణ ఏఐ (AI) హబ్’ను ఆవిష్కరించనున్నారు. అలాగే టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో, డిపి వరల్డ్ వంటి దిగ్గజ అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా..?
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుండి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో 64 మంది దేశాధినేతలు, 400 మంది రాజకీయ ప్రముఖులు, , పలు అంతర్జాతీయ కంపెనీల అధిపతులు ఉన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ ప్రభుత్వం తన పారిశ్రామిక , సాంకేతిక విధానాలను చాటిచెప్పేందుకు సిద్ధమైంది.
Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!