Waqf Act: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహిస్తామని ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) తెలిపింది. అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్‌జేపీలను విమర్శిస్తూ.. ఆ పార్టీల లౌకిక ముసుగు తొలగిపోయిందని పేర్కొంది.
పూర్తిగా చట్టాన్ని రద్దు చేసే వరకు నిరసన తెలుపుతామని AIMPLB ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని ముస్లిం సమాజానికి నిరాశ అవసరం లేదని బోర్డు హామీ ఇచ్చింది. విషయంలో నాయకత్వం ఎలాంటి త్యాగానికైనా వెనకాడదని, న్యాయం కోరుకునే అన్ని శక్తులతో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పింది. శనివారం జరిగిన సమావేశంలో బోర్డు అధికారులు ఈ విషయాలను, అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు ప్రకటన పేర్కొంది.
Read Also: MK Stalin: ప్రధాని మోడీ కార్యక్రమానికి స్టాలిన్ గైర్హాజరు.. కారణం ఇదే..
శనివారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ బిల్లును ఆమోదించడంతో వక్ఫ్ సవరణ చట్టం 2025 అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా నిరసనలతో పాటు సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేయడానికి చట్టపరమై మార్గాన్ని తీసుకుంటుందని బోర్డు చెప్పింది. ప్రదర్శనలు, నల్ల బ్యాండ్లతో నిరసన, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజాస్వామ్య, శాంతియుత నిరసన మార్గాల్లో తమ వ్యతిరేకతను తెలియజేస్తామని చెప్పింది.
ప్రతీ రాష్ట్ర రాజధానిలోనూ, జిల్లా స్థాయిలో నిరసన నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమంలో మొదటి దశలో భాగంగా శుక్రవారం నుంచి ‘‘సేవ్ వక్ఫ్, సేవ్ ది కాన్స్టిట్యూషన్’’ నినాదంతో ఈ వారం మొత్తం నిరసన నిర్వహించనున్నట్లు బోర్డు చెప్పింది. అదే విధంగా ఢిల్లీలో ఇతర మతాల నాయకులు, వక్ఫ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబద్, బెంగళూర్, చెన్నై, విజయవాడ, మలప్పురం, పాట్నా, రాంచీ, మలేర్‌కోట్ల, లక్నోల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించబడుతాయని చెప్పారు.
ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభమవుతుందని, మొదటి దలో ఈ కార్యక్రమాన్నీ జూన్‌లో ఈద్ అల్ అధా వరకు కొనసాగుతాయని చెప్పారు. ముస్లింలందరూ ముఖ్యంగా యువత ఓపిక, ప్రశాంతంగా దృఢ వైఖరితో ఉండాలని బోర్డు ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేసినట్లు బోర్డు తన ప్రకటనలో తెలిపింది. మతతత, విధ్వంసక శక్తులకు అవకాశాలు కల్పించే విధంగా భావోద్వేగాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన కోరారు.