Fake Doctor: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్‌ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు.
ఒక నెలలోనే ఆస్పత్రిలో ఏడుగురు మరణించడం సంచలనంగా మారింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి క్రిస్టియన్ మిషనరీలో కార్డియాలజిస్ట్‌గా చలామణీ అవుతున్నారు. తాను ఫేమస్ బ్రిటన్ వైద్యుడిగా నటించాడు. దర్యాప్తులో అతడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌గా తేలింది. ఈ ఘటనపై న్యాయవాది, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ మాట్లాడుతూ.. అధికారిక మరణాలు 07, అయితే, అసలు సంఖ్య దీని కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనిపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
Read Also: Vikarabad: రూ. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసిన మరో మహిళ..
‘‘ కొంతమంది పేషెంట్లు చనిపోలేదు. వారు తమ వద్దకు వచ్చి సంచలన విషయాలు చెప్పారు ఒకరు తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని, ఆ వ్యక్తి(డాక్టర్) ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యాడని, భయపడి వెంటనే జబల్ పూర్ తీసుకెళ్లినట్లు చెప్పాడు. అప్పుడు ఆ ఆస్పత్రిలో పనిచేసేది నకిలీ డాకర్ట్ అని మాకు తెలిసింది. అసలు వ్యక్తి బ్రిటన్‌లో ఉన్నాడని, ఆ వ్యక్తి పేరు నరేంద్ర యాదవ్. హైదరాబాద్‌లో ఇతడిపై కేసు ఉంది. అతను నిజమైన పత్రాలను చూపించలేదు’’ అని తివారీ చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ, మిషనరీ ఆసుపత్రి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుండి డబ్బు అందుకుంటుందని అన్నారు.
ఈ ఆరోపణలతో జిల్లా దర్యాప్తు బృందం ఆస్పత్రి నుంచి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో నకిలీ వ్యక్తి బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడిపై హైదరాబాద్‌లో క్రిమినల్ కేసుతో పాటు అనేక వివాదాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు ముగిసిన తర్వాత తన స్టేట్మెంట్ ఇస్తానని జిల్లా కలెక్టర్ సుధీర్ కొచ్చర్ తెలిపారు. దామోహ్ ఎస్పీ అభిషేక్ తివారీ మిషనరీ ఆస్పత్రి మరణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.