Amit Shah: 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి విడిపిస్తామని మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బస్తర్ పాండు కార్యక్రమంలో జరిగిన సభలో షా ప్రసంగిస్తూ.. బస్తర్‌లో మావోయిజం అంతమయ్యే దళలో ఉందని, వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో ‘‘లాల్ ఆతంక్’’ పట్టు నుంచి విముక్తి చేయడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
Read Also: Fake Doctor: దారుణం.. హార్ట్ సర్జరీలు చేసిన “ఫేక్ డాక్టర్”.. ఏడుగురి మృతి..
గత మూడు నెలల్లో 521 మంది నక్సల్స్ లొంగిపోయారని, 2024లో మొత్తం 881 మంది నక్సల్స్ లొంగిపోయానని చెప్పారు. లొంగిపోయే వారికి జనజీవన స్రవంతిలోకి తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. అదే విధంగా ఆయుధాలు చేతపట్టిన వారు భద్రత దళాలను ఎదుర్కుంటారని హెచ్చరించారు. బస్తర్ ఇకపై భయానికి చిహ్నం కాదని, భవిష్యత్తుకు చిహ్నమని అన్నారు.
గతంలో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని సందర్శించకుండా, అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ నాయకులు ప్రసంగాలు చేయకుండా ఆపేవారు, ముఖ్యమంత్రి వెళ్లవద్దని చెబుతారు, కానీ ఇప్పుడు మేము 50,000 మంది ఆదివాసీ సోదరులు, సోదరీమణులతో రామనవమి, అష్టమిని జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు. అమిత్ షా పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉపముఖ్యమంత్రి విజయ్ వర్మ షా కూడా హాజరయ్యారు. క్యాబినెట్ మంత్రులు కేదార్ కశ్యప్, రాం విచార్ నేతమ్, బీజేపీ స్టేట్ ప్రెసిడెందట్ కిరణ్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు అమిత్ షా దంతేవాడలోని మా దంతేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేశారు.