Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
ఆర్ఎస్ఎస్ వెబ్‌సైట్ వ్యాసంలో భారతదేశంలో కాథలిక్ సంస్థలకు 7 కోట్ల హెక్టార్ల భూమి ఉందని, అవి అతిపెద్ద ప్రభుత్వేతర భూ యజమానులుగా ఉన్నాయని పేర్కొందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వక్ఫ్ బిల్లు ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తుందని నేను చెప్పాను. కానీ భవిష్యత్తులో ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ క్రైస్తవుల వైపు దృష్టి మరల్చడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇటువంటి దాడుల నుంచి ప్రజల్ని రక్షించే ఏకైక కవచం రాజ్యాంగం, దానిని రక్షించడం అందరి విధి’’ అని ట్వీట్ చేశారు.
Read Also: Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
వక్ఫ్ బిల్లు ఆమోదం సమయంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తర్వాతి టార్గెట్ క్రైస్తువులే అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వ్యాసంలో భారతదేశంలో కాథలిక్ సమాజం చేతిలో 7 కోట్ల ఎకరాలు ఉన్నాయని స్పష్టంగా పేర్కొందని, తదుపరి వారి టార్గెట్ కాథలిక్ కమ్యూనిటీనే అని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల ఆరోపించారు.
‘‘భారతదేశంలో ఎవరికి ఎక్కువ భూమి ఉంది..? కాథలిక్ చర్చి వర్సెస్ వక్ఫ్ బోర్డు చర్చ’’ అనే టైటిల్‌తో కూడిన వ్యాసంలో, కాథలిక్ సంస్థల కింద ఉన్న భూమిలో ఎక్కువ భాగాన్ని బ్రిటిష్ పాలనలో 1927 ఇండియన్ చర్చి చట్టం ద్వారా స్వాధీనం చేసుకుందని ఆరోపించింది. వలసవాద కాలంలో లీజుకు తీసుకున్న భూమిని ఇకపై చర్చి ఆస్తిగా గుర్తించబోమని పేర్కొన్న 1965 ప్రభుత్వం ఉత్తర్వులను ఉదహరించింది. అంతకుముందు వక్ఫ్ బిల్లు ముస్లిం హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉంటే, కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలియజేయడం గమనార్హం.
https://twitter.com/RahulGandhi/status/190839863927527449