Wife torture: భార్యలు, అత్తమామల వేధింపులకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూర్‌లో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య మొదలు అప్పటి నుంచి చాలా మంది భార్యల వేధింపుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా, ఒడిశాకు చెందిన మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు.
'Hands Off' Protest: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతడి మద్దతుదారు బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతోంది. ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసన ప్రదర్శనలతో ఆందోళనకారులు హోరెత్తిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా ‘‘పరస్పర పన్నుల’’ విధించడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఉద్యోగాల కోతపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్‌ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది. కొత్త పాలకుడు మహ్మద్ యూనస్ భారత్ టార్గెట్‌గా గేమ్స్ ఆడుతున్నాడు. దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ, బీఎన్పీ వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూనస్ పాకిస్తాన్, చైనాకలు పెద్దపీట వేస్తున్నాడు.
Saudi Arabia: హజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు వీసాను నిషేధించింది.
MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్‌లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు.
Sambhal: గతేడాది నవంబర్‌లో సంభాల్ హింసాకాండ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లిం మూక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణ జరిగిన ప్రదేశంలో, షాహీ జామా మసీదు సమీపంలో పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రారంభించారు. ఈ పోలీస్ అవుట్‌పోస్ట్‌ని 8 ఏళ్ల గుంగున్ కశ్యప్ అనే బాలిక ప్రారంభించడం విశేషం. గతేడాది నవంబర్‌లో చెలరేగిన కోట్ గర్వి […]
Heart Attack: ఇటీవల కాలంలో ఉన్నట్లుండి యువత గుండెపోటుకు గురవుతోంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఓ కాలేజీ విద్యార్థిని స్పీచ్ ఇస్తూనే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. 20 ఏళ్ల విద్యార్థిని వర్ష ఖరత్ ప్రసంగం మధ్యలో నవ్వుతూ కనిపించింది. ప్రసంగిస్తూనే, హార్ట్ ఎటాక్ రావడంతో మరణించింది.
Jagjit Singh Dallewal: సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతులు లేవనెత్తిన ఇతర అంశాలను డిమాండ్ చేస్తూ ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని ప్రకటించారు.
PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు.
Gujarat: తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. 11వ తరగతి చదువుతున్న బాలిక తల్లి మందలించిన రెండు రోజుల తర్వాత ఈ ఘటనకు పాల్పడింది. బాలిక, తన తమ్ముడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంది. తన కుమార్తె క్రమం తప్పకుండా తన ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడాన్ని తల్లి అభ్యంతరం చెప్పింది. ఆమె తన సొంత వాహనాన్ని ఉపయోగించకుండా, తన కుమార్తెపై ఎందుకు ఆధారపడుతుందని తల్లి ప్రశ్నించింది.