Crown Prince of Dubai: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8-9 తేదీల్లో భారత్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ వస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం చేయడానికి పలు సమావేశాల్లో పాల్గొననున్నారు.
Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సౌరభ్ భార్య ముస్కాన్ గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆస్పత్రి నుంచి ఒక టీమ్ సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధ్రువీకరించారు.
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు పిటిషన్లు దాఖలు చేయగా, పలు పార్టీలు కూడా పిటిషన్లు వేస్తున్నాయి.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థలోకి ప్రవేశం గురించి మాట్లాడుతూ.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులుగా భావించే వారికి తప్ప, సంస్థలోకి అందరికి తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. మతం, కులం, వర్గం వంటి వాటిని బట్టి ఆరాధన పద్ధతులు మారుతుంటాయి,
Prasanna Sankar-Dhivya: టెక్ బిలయనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ దంపతులు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రసన్న శంకర్, అతడి భార్య దివ్యా శశిథర్ కిడ్నా్ప్, లైంగిక వేధింపులు ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రసన్న శంకర్ విడాకులు, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. తన భార్య దివ్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రసన్న, దివ్యపై సంచలన ఆరోపణలు చేశారు.
Petrol price hike: కేంద్ర ప్రభుత్వం వాహన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కి రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
Karnataka: కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. సొంత కమ్యూనిటీకి చెందిన సభ్యులే దొంగతం ఆరోపణలో ఓ బాలుడిని చిత్రహింసలు పెట్టారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. బాధితుడిని చన్నగిరి తాలూకా నల్లూర్ సమీపంలోని అస్తపనహళ్లీ గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిగా గుర్తించారు.
Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతికి చెందిన ఒక ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్‌కి సాంకేతిక సహాయం చేశారని వానియా అగర్వాల్ అనే టెక్కీ ప్రశ్నించింది. ఇజ్రాయిల్ సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ భాగస్వామి అని ఆమె ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ బాస్‌లు సత్య నాదెళ్ల, స్టీవ్ బాల్మెర్, బిల్ గేట్స్ ముగ్గురూ ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి ఆగ్రహంలో వీరంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సం…