Emmanuel Macron: వియత్నాం పర్యటనలో ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌కి చేదు అనుభవం ఎదురైంది. విమానం నుంచి దిగుతుండగా, అతడి భార్య బ్రిగిట్టే మక్రాన్ చెంపపై కొట్టడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అంతే కాకుండా, విమానం దిగేటప్పుడు మక్రాన్ చేతిని బ్రిగిట్టే పట్టుకునేందుకు నిరాకరించింది. విమానంలో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య తగాదా జరిగినట్లు తెలుస్తోంది.
BJP: కర్ణాటక బిజెపి ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కలబురిగిలో జరిగిన ఒక సభలో రవి కుమార్ మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణ స్వామి పట్ల వ్యవహరించిన తీరుపై ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ మద్దతుదారులు ప్రభుత్వ అతిథి గృహాన్ని ముట్టడించిన సమయంలో ఆయన లోపల ఉన్నారు.
Jaishankar: పాకిస్తాన్‌తో ఇటీవల నెలకున్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. ఉద్రిక్తతల గురించి విదేశాలకు చాలా సులభంగా వివరించిందని.. ‘‘వారు కాల్పులు జరుపుతారు, మేము కాల్పులు జరుపుతాము,
Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్‌ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో సంబంధం లేదని చెప్పారు. అతను ‘‘నైతిక…
India China: చైనా తన బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌తో పాటు కరుడుగట్టిన ఉగ్రవాదులపై ఆంక్షలు కోసం భారత్ చేస్తున్న అభ్యర్థనను చైనా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జెఎం) ఉగ్రవాదులను నిషేధించి,
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కి తీరని నష్టాన్ని మిగిల్చింది. పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు తర్వాత, భారత్ దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. అయితే, దీని తర్వాత పాక్ సైన్యం భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ప్రతిగా భారత్ మే 10 తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. మొత్తం 11 ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళం 20 శాతం ఆస్తుల్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. మొత్తం 09 లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Sangita Bhil: మధ్యప్రదేశ్‌కి చెందిన సంగీతా భిల్ ఇప్పుడు ఉత్తరాదిన ఇప్పుడు ఈమె సనాతన ధర్మానికి, హిందూ మతానికి ప్రతీకగా నిలుస్తున్నారు. మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని బిచోలి గ్రామానికి చెందిన సంగీతా వివాహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గిరిజన వర్గానికి చెందిన సంగీతాకు ఏప్రిల్ 17, 2025న ఆశిష్‌తో వివాహం జరిగింది. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆమె తన అత్తగారింటికి ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది.
China: విదేశీ అమ్మాయిలతో, అక్రమ వివాహాలకు దూరంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, చైనా పౌరులకు సూచించింది. ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ పథకాల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. చైనా ప్రభుత్వం మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘‘క్రాస్ బోర్డర్ డేటింగ్’’కి లొంగవద్దని చైనీయులను కోరింది.
Jyoti Malhotra: యూట్యూబర్, పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పాకిస్తాన్ ఐఎస్ఐకి చెందిన వారితో సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మూడు సార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు తేలింది.