Sangita Bhil: మధ్యప్రదేశ్‌కి చెందిన సంగీతా భిల్ ఇప్పుడు ఉత్తరాదిన ఇప్పుడు ఈమె సనాతన ధర్మానికి, హిందూ మతానికి ప్రతీకగా నిలుస్తున్నారు. మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని బిచోలి గ్రామానికి చెందిన సంగీతా వివాహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గిరిజన వర్గానికి చెందిన సంగీతాకు ఏప్రిల్ 17, 2025న ఆశిష్‌తో వివాహం జరిగింది. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆమె తన అత్తగారింటికి ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది.
వివాహ తర్వాతి రోజు సంగీత ఉండ్వా గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లడంలో షాక్ తగిలింది. అత్తగారు పూజగదిలోకి తీసుకెళ్లడం అక్కడ ఆమె పూజించే హిందూ దేవీదేవతలకు బదులుగా క్రైస్తవ ‘శిలువ’ ఉండటం ఆమెను షాక్‌కి గురిచేసింది. పెళ్లికి ముందు అత్తింటి వారు తాము క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నట్లు ప్రకటించలేదు. వివాహం తర్వాత తన సనాతన ధర్మాన్ని వదిలే ప్రసక్తే లేదని, సంగీత తిరిగి తన పుట్టింటికి వచ్చింది. 12 కి.మీ దూరంలోని తన సొంత ఊరు బిచోలికి కాలినడకన తిరిగి వచ్చింది. ఆమె అత్తగారింటి నుంచి బయటకు వచ్చే ముందు ‘‘తాను క్రైస్తవ్యాన్ని స్వీకరించను. నేను మీ ఇంట్లో ఉండలేను. మీరు క్రైస్తవులుగా ఉన్నంత కాలం నన్ను మరిచిపోండి’’ అని తెగేసి చెప్పింది.
Read Also: China: ‘‘విదేశీ భార్యల’’ షాపింగ్‌పై నిషేధం.. బంగ్లాదేశ్ విషయంలో తన పౌరుల్ని హెచ్చరించిన చైనా..
దీని తర్వాత, మతం దాచి పెళ్లి చేసుకున్న కారణంగా సంగీత భర్త ఆశిష్, అతడి తండ్రి గజ్జు మచ్చర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఐదురోజులు జైలులో ఉన్న తర్వాత వీరు బెయిల్ పై విడుదలయ్యారు. చివరకు, సంగీత పోరాటం నచ్చడం, భిల్ గిరిజన పంచాయతీల తర్వాత అత్తింటి వారంతా తిరిగి తమ సొంత మతమైన ‘‘హిందూమతం’’కి మారారు. ఆశిష్ కుటుంబం గత 20 ఏళ్లుగా అనుసరిస్తున్న క్రైస్తవ మతాన్ని వదలి సనాతన ధర్మంలోకి వచ్చారు. ప్రలోభాలకు లొంగి తాము క్రైస్తవ మతంలో చేరామని, ఇప్పుడు సొంత మతాన్ని ఆచరిస్తుండటం సంతోషంగా ఉందని ఆ కుటుంబం వెల్లడించింది.
సంగీతా భిల్ పోరాటం, మతం దాచి వివాహం చేసుకుంటున్న వారికి ఒక గుణపాఠం. ఇలాంటి మోసాలను ఎదుర్కొన్న ఈ గిరిజన యువతి అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం, ఆశిష్ సంగీతాని తన ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. తనకు ముందే వారు క్రైస్తవులని తెలిస్తే వివాహం చేసుకునే వానని కాదని, నేను హిందువుని, హిందువుగానే ఉంటాను’’ అని సంగీత చెప్పింది. ఒక వేళ వారి మతంలోకి మారితే తన సోదరులు, కుటుంబంతో సంబంధాలు తెలిపోయేవని చెప్పింది.
వరసగా కేసులు, గిరిజన సమాజం హెచ్చరికలతో ఆశిష్ కుటుంబం సనాతన ధర్మాన్ని స్వీకరించింది. ఇప్పుడు సంగీత తన అత్తింటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అయితే, వారు మళ్లీ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆశిష్ మాట్లాడుతూ.. ‘‘మేము హిందూ మతంలోకి తిరిగి వచ్చాము, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పాడు.